Actress Kasturi: కస్తూరికి రిమాండ్.. జైలుకు తరలింపు

Actress Kasturi: కస్తూరికి రిమాండ్.. జైలుకు తరలింపు
x
Highlights

Actress Kasturi arrested and remanded: సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రఘుపతి...

Actress Kasturi arrested and remanded: సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రఘుపతి రాజా ఆమెకు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం కస్తూరిని ఎగ్మోర్ పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. నవంబర్ 29వ తేదీ వరకు కస్తూరి రిమాండ్ లో ఉండనున్నారు. తమిళనాడులో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో కస్తూరి మాట్లాడుతూ తెలుగు వారికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనే చెన్నైలోని ఎగ్మోర్ పోలీసు స్టేషన్‌లో తెలుగు సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి ఎగ్మోర్ పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు.

విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. దీంతో ఆమె పరారీలో ఉన్నారని భావించిన పోలీసులు బృందాలుగా విడిపోయి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం కస్తూరిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories