Actress Kasthuri: తెలుగువారిపై సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

Actress Kasthuri Controversial Comments on Telugu People
x

Actress Kasthuri: తెలుగువారిపై సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

Highlights

Kasthuri: రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు...

Kasthuri: రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ మాటలు మాట్లాడుతున్నారన్నారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు... ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే... మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు.. అని పరోక్షంగా ద్రవిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు.

ప్రభుత్వంలో భాగం, అధికారంలో భాగం కావాలి అంటూ డీపీఐ ప్రధాన కార్యదర్శి తోల్ తిరుమావళవన్ కొత్త నినాదం తీసుకొచ్చారని, కానీ తెలుగు మాట్లాడే వారికి ఎప్పుడో ప్రభుత్వంలో, అధికారంలో భాగస్వామ్యం కల్పించారని అన్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారని అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోందని కస్తూరి పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories