అందుకే గౌతమ్ ని పెళ్ళాడా.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కాజల్!

అందుకే గౌతమ్ ని పెళ్ళాడా.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కాజల్!
x
Highlights

అందరమ్మాయిల లాగే తానూ కూడా తనకి కాబోయే వాడు మోకాళ్ళ పైన నిల్చొని గులాబీ పువ్వు అందించి తనకి లవ్ ప్రపోజ్ చేయాలనీ కోరుకునేదాన్ని. తానూ అనుకున్న విధంగానే గౌతమ్ తన ప్రేమను వ్యక్తపరిచాడని వెల్లడించింది కాజల్.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తోంది కాజల్. అయితే తానూ గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది కాజల్.

అందరమ్మాయిల లాగే తానూ కూడా తనకి కాబోయే వాడు మోకాళ్ళ పైన నిల్చొని గులాబీ పువ్వు అందించి తనకి లవ్ ప్రపోజ్ చేయాలనీ కోరుకునేదాన్ని. తానూ అనుకున్న విధంగానే గౌతమ్ తన ప్రేమను వ్యక్తపరిచాడని వెల్లడించింది కాజల్. దీనితో తానూ గౌతమ్ ప్రేమను కాదనలేకపోయానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ప్రపోజ్ చేయడానికి ముందే గౌతమ్ తన పేరెంట్స్ తో మాట్లాడి, వారిని పెళ్ళికి ఒప్పించి ఆ తరవాత తనకి ప్రపోజ్ చేసినట్టుగా వెల్లడించింది. తనకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టమని, అందుకే గౌతమ్‌తో లవ్ ప్రపోజ్ చేయించుకొని, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వెల్లడించింది ఈ మిత్రవింద.

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కాజల్ .. కమల్‌ హాసన్‌,శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న 'భారతీయుడు 2'లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా దుల్కర్‌ సల్మాన్‌, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్.. ఈ సినిమాలు కరోనా వలన వాయిదా పడ్డాయి. పెళ్లి అయ్యాక కూడా సినిమాలలో నటిస్తానని కాజల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories