Janhvi Kapoor: అందుకు చాలా సంతోషంగా ఉంది.. దేవర సాంగ్‌పై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు

Actress janhvi kapoor says she feels happy for not getting any trolls on devara song
x

Janhvi Kapoor: అందుకు చాలా సంతోషంగా ఉంది.. దేవర సాంగ్‌పై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు 

Highlights

ఇక ఆచార్య వంటి ఫ్లాప్‌ తర్వాత కొరటాల ఎలాగైనా ఈసారి మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టాలనే కసితో తీసుకొచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవీ గారాల పట్టి జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తెలుగు స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమైంది జాన్వీ. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజ్‌కి చేరుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇక ఆచార్య వంటి ఫ్లాప్‌ తర్వాత కొరటాల ఎలాగైనా ఈసారి మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టాలనే కసితో తీసుకొచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు పాటలు సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల సినిమా నుంచి విడుదలైన చుట్టమల్లే అనే సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ పాటలో ఎన్టీఆర్‌, జాన్వీల మధ్య ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి.

జాన్వీ అందాల విందుతో కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపారు. కాగా ఈ పాటకు సోషల్‌ మీడియాలో సైతం మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇదే విషయమై జాన్వీ స్పందించారు. సాధారణంగా ఏదైనా పాట విడుదలైనప్పుడు అందులోని లోపాలను చూపిస్తూ ట్రోల్స్‌ చేస్తుంటారని, అయితే ‘చుట్టమల్లే’ పాటకు ఎలాంటి ట్రోల్స్‌ రాకపోవడం చాలా ఆనందంగా ఉందని జాన్వీ తెలిపింది. దేవర విజయం కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందని జాన్వీ ధీమా వ్యక్తం చేసింది.

ఇక దేవర చిత్రానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ప్రమోషన్‌ చేస్తుందీ బ్యూటీ. ముఖ్యంగా చుట్టుమల్లే సాంగ్‌ మేకింగ్ వీడియోలను షేర్‌ చేస్తోంది. ఈ పోస్ట్‌లకు మంచి ఆధరణ లభిస్తోంది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతోన్న దేవర చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories