Ileana: ప్రియుడితో బ్రేకప్..ఆ కోరిక తీరలేదన్న ఇలియానా?

Ileana Wants Action Movies
x

ఇలియానా ఫైల్ ఫోటో 

Highlights

Ileana: ప్రియుడితో బ్రేకప్ తర్వాత ఇలియానా తన అసలు కోరిక బయటపెట్టింది. ఇప్పటి వరకు గ్లామర్స్ పాత్రలే చేసిన ఈ హీరోయిన్. యాక్షన్..

Ileana: వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' మూవీతో వెండితెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో.. ఈ అమ్మడికి ఆఫర్లు తన్నుకొచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్, పపవన్‌ కల్యాణ్‌, రవి తేజ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ఫూల్ బీజీ అయింది. అవకాశాలు తన్నుకొస్తున్న సమయంలో బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌ సరసన అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'బర్ఫీ' సినిమాలో నటించే చాన్స్‌ కొట్టెసింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు సక్సెస్ అందుకోలేదు.

ఈ క్రమంలో మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. రవితేజతో 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ కాకపోవడంతో ఇక్కడ కూడా గోవా బ్యూటీకి చాన్స్ రాలేదు. ఇటీవల ఆమె ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. ఏది పడితే అది చేయాలని నేను అనుకోవడం లేదు. కథలో పాత్రకి ప్రాధాన్యం ఉండాలి. నా దగ్గరకు వచ్చిన కథలని ఆచితూచి ఎంపిక చేస్తున్నాను. రొటీన్‌కి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను. అంతేకాక.. పూర్తిస్థాయిలో యాక్షన్ చిత్రంలో నటించాలని ఉంది' అంటూ తన కోరికను వెల్లడించింది. అయితే ఇలియానా కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

ఇలియానా పూర్తిగా సినిమాలు తగ్గించి ప్రముఖ అస్ట్రేలియా ఫొటో గ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అతడికి బ్రేకప్‌ చెప్పిన ఇలియానా మళ్లీ సినిమాలపై మొగ్గు చూపింది. ఇటీవల బాలీవుడ్‌లో అభిషేక్‌ బచ్చన్‌తో బిగ్‌ బుల్‌లో నటించింది. అయితే గతంతో పోలిస్తే ఇలియానాకు ఇప్పుడు సినిమ అవకాశాలు అంతగా లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర​స్తుతం హిందీలో రణ్‌దీప్‌ హుడాతో 'అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' మూవీలో నటిస్తుంది. అంతేగాక ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, తన ట్విట్టర్‌ను ఓపెన్ చేయలేకపోతున్నట్లు తెలిపింది. కాబట్టి అందులో ఎలాంటి ట్వీట్లు వచ్చినా పట్టించుకోవద్దని ఇలియానా తన ఫ్యాన్స్‌కు సందేశం ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories