Deeksha Seth: రెబల్‌ బ్యూటీ దీక్షాసేత్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? అందం విషయంలో..

Actress Deeksha Seth Latest Photos Goes Viral in Social Media
x

Deeksha Seth: రెబల్‌ బ్యూటీ దీక్షాసేత్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? అందం విషయంలో..

Highlights

Deeksha Seth: 2010లో వచ్చిన వేదం మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార దీక్షాసేత్‌.

Deeksha Seth: 2010లో వచ్చిన వేదం మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార దీక్షాసేత్‌. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమాలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో అద్భుత నటనను కనబరిచింది.

ఇక ఈ సినిమా వెంటనే మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్‌ చిత్రంతో నటించింది. ఇలా వరుసగా బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలను తన ఖాతాలో వేసుకుంది దీక్షాసేత్‌. దీంతో దీక్షాసేత్‌ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతుంతని అంతా భావించారు.

అయితే సీన్‌ దీనికి రివర్స్‌గా జరిగింది. నిప్పులు, ఊ కొడతరా ఉలిక్కి పడతారా మూవీలు పరాజయం పొందాయి. ఇక ప్రభాస్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసినా రెబల్‌ మూవీ మాత్రం దీక్షా సేత్‌కు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో రెబల్‌ మూవీ తర్వాత దీక్షాసేత్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. రెబల్ తర్వాత రెండు హిందీ మూవీస్‌లో నటించిన దీక్షా ఆ తర్వాత మళ్లీ వెండి తెరకకు కనిపించలేదు. 2016 తర్వాత దీక్షాసేత్‌ మళ్లీ ఏ సినిమాలో నటించలేదు.

ప్రస్తుతం దీక్షా సేత్‌ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. దీంతో ఈ అందాల తార ఇప్పుడు ఏం చేస్తోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోందీ బ్యూటీ. ప్రస్తుతం విదేశాల్లో ఉంటోన్న దీక్షాసేత్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీక్షాకు సంబంధించి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories