Anita Hassanandani : నువ్వు నేను ఫేం అనిత తన అభిమానులకి శుభవార్తని చెప్పింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లుగా తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది అనిత..
Anita Hassanandani : నువ్వు నేను ఫేం అనిత తన అభిమానులకి శుభవార్తని చెప్పింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లుగా తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది అనిత.. ఆ వీడియోలో రోహిత్ - అనిత పరిచయం, ప్రపోజ్ చేసుకోవడం, పెళ్లి.. ఇలా ప్రతి విషయాన్ని ఆకట్టుకునేలా చూపించారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అనిత దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు గతంలో అనిత తల్లికాబోతుందని అంటూ పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిన్నింటినీ కొట్టివేశారు.
ఇక ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, అక్షయ్ ఖన్నా మెయిన్ లీడ్ లో వచ్చిన 'తాళ్' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది అనిత.. ఆ తర్వాత తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది అనిత.. ఆ తర్వాత శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ మొదలుగు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది .
ఇక 2013 న వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకుంది. ఈ జంట 2019 లో ప్రసారమైన నాచ్ బలియే సీజన్ 9 అనే డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది .ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది అనిత..
View this post on Instagram❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy
A post shared by Anita H Reddy (@anitahassanandani) on
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire