Ananya Nagalla: నచ్చితే చేయండి.. లేకపోతే లేదు.. అసహనం వ్యక్తం చేసిన అందాల తార

Ananya Nagalla Reacts to Marriage Rumours | Tollywood
x

 నాకోసం వరుణ్ణి వెతికేందుకు థాంక్యూ అంటున్నా పవన్ కళ్యాణ్ హీరోయిన్

Highlights

సినీ తారలకు అభిమానులకు మధ్య దూరం తగ్గుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ నేరుగా తమ అభిమాన తారలతో మాట్లాడుతున్నారు.

సినీ తారలకు అభిమానులకు మధ్య దూరం తగ్గుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ నేరుగా తమ అభిమాన తారలతో మాట్లాడుతున్నారు. సినీ తారలు చేసిన పోస్టింగ్స్ కు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరి అత్యుత్సాహం సినీ తారలను ఇబ్బందికి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది అందాల తార అనన్య నాగళ్ల.

ఇంతకీ ఏమైందంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే అనన్య తాజాగా.. ప్లాస్టిక్‌ వాడద్దంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై నెటీజెన్లు భిన్న రకాలుగా స్పందించారు. అనన్యను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కొంచెం అసహనానికి గురైన అనన్య నెటిజన్లపై సీరియస్‌ అయ్యింది. విమర్శలపై సుతి మెత్తగానే రియాక్ట్ అయ్యింది.

తాజాగా అనన్య.. స్ట్రా లేకుండా కొబ్బరి బొండాం తాగుతూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. సాధారణంగా తాను స్టీల్‌ స్ట్రాను తన వెంట తెచ్చుకుంటానని.. అది లేనప్పుడు ఇలా డైరెక్ట్‌గా కొబ్బరి నీళ్లు తాగుతానని చెప్పింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దామని చెప్పింది. దీనిపై చాలామంది పాజిటివ్‌గా రియాక్ట్‌ అవ్వగా.. కొంతమంది మాత్రం అనన్య నాగళ్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఈ విషయమై అనన్య మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేసింది. నీ పక్కన స్ట్రాతో తాగుతున్నారు.. వాళ్లకు చెప్పండి.. మీరు కారు వాడట్లేదా.. ఇవన్నీ ఎందుకు అని సీరియస్‌ అయ్యింది. చిన్న విషయం చెప్పా.. నచ్చితే చేయండి.. లేకపోతే లేదు.. సింపుల్‌ కదా అని చెప్పింది. ఎందుకింత నెగిటివిటీ అంటూ చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories