Balakrishna: బాలకృష్ణ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Actress aishwarya rai takes blessings from balakrishna in iifa awards 2024, Viral video
x

 Balakrishna: బాలకృష్ణ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Highlights

Balakrishna: ఈ అవార్డును నట సింహం బాలయ్య (Balakrishna) చేతుల మీదుగా అందుకుంది ఐశ్వర్య (Aishwarya Rai).

Balakrishna: సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఫా ఉత్సవం 2024 విజయవంతంగా ముగిసింది. అబుదాబిలో జరిగిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అన్ని భాషలకు చెందిన ప్రముఖులు ఈ వెంట్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో యానిమల్‌ మూవీకి అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తమిళ సినిమా పొన్నియన్‌ సెల్వన్‌లో నటనకు గాను ఐశ్వర్యరాయ్‌కి అవార్డు దక్కింది. ఈ అవార్డును నట సింహం బాలయ్య చేతుల మీదుగా అందుకుంది ఐశ్వర్య.

అవార్డును తీసుకోవడానికి స్టేజ్‌ మీదికి వచ్చిన ఐశ్వర్య రాయ్...బాలయ్య కాళ్లకు నమస్కరించారు. దీంతో బాలకృష్ణ సైతం ఆమె తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాతే ఆమె అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బాలకృష్ణకు సినీ రంగంలో ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. అలాగే ఐశ్వర్య సింప్లిసిటీ, పెద్దలపై ఆమెకు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌కు.. మణిరత్నం, సమంత, చిరంజీవి, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, వెంకటేశ్, ఐశ్వర్యాయ్, షాహిద్ కపూర్, అనన్య పాండే, కృతి సనన్, కరణ్ జోహార్, జావేద్ అక్తర్, షబానా ఆజ్మీ వంటివారు హాజరయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories