Adah Sharma: నేను సోఫాలో కూర్చోవాలని అనుకోలేదు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ
Adah Sharma: ఇక 2008 నుంచి ప్రారంభమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపిన అదాశర్మ.. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చారు.
Adah Sharma: క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీని ఈ పదం షేక్ చేస్తుంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే హీరోయిన్స్ కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలని ఇండస్ట్రీలో ఓ వాదన ఎప్పటి నుంచో నడుస్తోంది. ఎంతో మంది హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగానే బయట పెట్టారు కూడా. ఇక తాజాగ మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిషన్ విడుదల చేసిన నివేదికతో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి వచ్చింది.
దీంతో ఈ అంశంపై పలువురు నటీమణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార అదా శర్మ సైతం ఓపెన్ అయ్యారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నిజం చెప్పాలంటే.. నేను నేల మీదనే కూర్చున్నాను.. సోఫా(కౌచ్)లో కూర్చోవాలని అనుకోలేదు’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంటే అవకాశాల కోసం తానెప్పుడూ అలాంటి వాటికి ఒప్పకోలేదని అదాశర్మ తేల్చి చెప్పేసింది.
ఇక ఇదే విషయమై మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పుకొచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తామో.. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించాలని చూస్తే అంతే వేగంగా కనిపెట్టాలని ఆమె సూచించింది. ఆ సమయంలో మనం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టాలని, పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదని చెప్పుకొచ్చింది. ప్రతీ రంగంలో సపోర్ట్ నెట్వర్క్ కలిగి ఉండడం ముఖ్యమని, తనకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నానని అభిప్రాయపడింది అదాశర్మ.
ఇక 2008 నుంచి ప్రారంభమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపిన అదా.. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ ఇటీవల వచ్చి కేరళ స్టోరీ ద్వారా నేషనల్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తాజాగా ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire