గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్ .. బాలుని వైద్యానికి 20 లక్షల సాయం!

గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్ .. బాలుని వైద్యానికి 20 లక్షల సాయం!
x

Sonusood 

Highlights

Sonu Sood Help : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు..

Sonu Sood Help : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

తాజాగా సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తెలంగాణ రాష్త్రం లోని మహబూబాబాద్‌కు చెందిన హర్ష వర్థన్ అనే 6 ఏళ్ల బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సోనూసూద్ బాలుడి తల్లిదండ్రులను గురువారం హైదరాబాద్‌లో కలిశారు. అయితే వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని బాలుడి తల్లిదండ్రులు చెప్పడంతో చలించిపోయిన సోనూసూద్ బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదుకి వచ్చిన సోనూసూద్ బాలుడి సమస్యను గురించి అడిగి తెలుసుకున్నారు.

మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు-లక్ష్మి దంపతుల హర్షవర్దన్‌ అనే కుమారుడు ఉన్నాడు.. హర్ష వర్ధన్ ఆరున్నర నెలల వయసు నుంచే కాలేయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు.. ఇక అప్పటినుంచి వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ వస్తున్నారు. అయితే బాలుడి పరిస్థితి తాజాగా విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేయాలనీ వైద్యులు సూచించారు. దీనికి గాను రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు. అంత స్తోమత లేకపోవడంతో నటుడు సోనూసూద్ ని సహాయం కోరారు.. ఇది చూసి చలించిపోయిన సోనూసూద్ హామీ ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories