Tollywood Drugs Case: ఇవాళ నవదీప్ ను విచారించనున్న ఈడీ అధికారులు

Actor Navdeep Going to Attend Enforcement Directorate Inquiry on Tollywood Drugs Case Today 13 06 2021
x

నవదీప్ ను విచారించనున్న ఈడీ అధికారులు (ఫైల్ ఫోటో)

Highlights

* ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ * విచారణకు హాజరుకానున్న ఎఫ్ఎం క్లబ్ జనరల్ మేనేజర్

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇవాళ నటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముందు హాజరుకానున్నారు. కాగా, ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఎక్సైజ్ కేసులో గతంలో నవదీప్ విచారణకు హాజరయ్యారు. గతంలో 11 గంటల పాటు నవదీప్‌ను ఎక్సైజ్ శాఖ విచారించింది. పిఏంఎల్ఏ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో మళ్ళీ తెరపైకి నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మనీలాండరింగ్ కేసులో విచారణతో పాటుగా ఎఫ్‌ క్లబ్‌ పార్టీలపైనా కెల్విన్ తో జరిపిన డ్రగ్స్ లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ ను విచారించనుండటంతో ఆసక్తిగా మారింది.

ఇక డ్రగ్స్‌ కేసులో మొదటగా విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించారు అధికారులు. మనీ ల్యాండరింగ్‌తో పాటు ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై పలు ప్రశ్నలు వేశారు. ఆఫ్రికన్లకు మనీ ట్రాన్జాక్షన్లపై ఆరా తీశారు. ఆ తర్వాత హీరోయిన్లు ఛార్మిని 8 గంటలు, రకుల్‌ను 7 గంటలు విచారించారు. హీరో నందును 8 గంటల పాటు ఇంటరాగేషన్‌ చేశారు అధికారులు. ఇక రానా దగ్గుబాటిని 7 గంటలు.. హీరో రవితేజను 5 గంటలకు పైగా విచారించారు ఈడీ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories