Naresh: బేబీ కనిపించడం లేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన నరేష్‌.. అసలేమైందంటే..?

Naresh: బేబీ కనిపించడం లేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన నరేష్‌.. అసలేమైందంటే..?
x

Naresh: బేబీ కనిపించడం లేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన నరేష్‌.. అసలేమైందంటే..?

Highlights

Vijaykrishna Naresh: నటుడు నరేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

Naresh: నటుడు నరేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు నరేష్‌. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. తన బేకీ ఎక్కడో తప్పిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు నరేష్‌. ఇంతకీ బేబీ ఎవరు.? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నరేష్‌ వెక్కి వెక్కి ఏడుస్తూ తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని అంటున్నాడు. ఎవరికైనా తన బేబీ కనిపిస్తే కబురు పెట్టమంటూ అడుగుతున్నాడు. అయితే అందరూ కల్కి సినిమాలో బుజ్జి తెలుసుగానీ.. ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని.. తమ బేబీని ఎలాగైన వెతికి పెట్టమని ఏకంగా కల్కి చిత్రయూనిట్ తోపాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను ట్యాగ్ చేశాడు. వాళ్లకు బుజ్జి ఎలాగే, తనకు బేబీ అలాగే అంటూ వాపోయాడు. దీంతో నరేష్‌ వీడియో చూసిన కొందరు తొలుత మ్యాటర్‌ ఏంటో సీరియస్‌గా ఉందని అనుకున్నారు. అయితే చివరి వరకు చూస్తే అసలు విషయం అర్థమైంది.

నరేష్‌ పోస్ట్ చేసిన ఈ వీడియో సినిమా ప్రమోషన్స్‌లో భాగం. ప్రస్తుతం నరేష్‌ నటిఆస్తున్న కొత్త చిత్రం 'వీరాంజనేయులు విహారాయాత్ర'. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసమే ఇలాంటి ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. ఎప్పుడు గొడవలు పడే కుటుంబ సభ్యులు విహార యాత్రకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా గోవా వెళ్లాలని డిసైడ్‌ అవుతారు. ఇందుకోసం తమ పాత కారుకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. ఇక గోవాకు వెళ్లే క్రమంలో వీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అసలు ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో నరేష్ తోపాటు బ్రహ్మానందం నటిస్తుండడం విశేషం. సుధీర్ పుల్లట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్‌ లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. ఈటీవీ విన్‌ యాప్‌లో ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories