Chiranjeevi: చిరు పారిస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా.? లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసిన మెగాస్టార్‌..!

Actor Chiranjeevi Shares a Photo in Paris Olympics Along With his Wife Surekha
x

Chiranjeevi: చిరు పారిస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా.? లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసిన మెగాస్టార్‌..!

Highlights

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం పారిస్‌లో హాలీడే ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం పారిస్‌లో హాలీడే ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యతో పాటు కొడుకు రామ్‌ చరణ్‌, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారాతో కలిసి చిరు పారిస్‌లో గడుపుతున్నారు. ఇందులో భాగంగానే వీరి వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి మొన్నటి కుటుంబ సభ్యులంతా కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతున్న సమయంలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిరు మరో ఇంట్రెస్టింగ్‌ ఫొటోను పంచుకున్నారు.

ప్రస్తుతం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుస్తున్న ఒలింపిక్స్‌ వేడుకల ప్రారంభంలో పాల్గొన్నారు చిరంజీవి. ప్రపంచనలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ఈ వేడుకలు చూసేందుకు పారిస్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన ఫొటోను చిరు ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. భార్య సురేఖతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు చిరు.

ఇందులో ఒలింపిక్‌ టార్చ్‌ ప్రతిరూపాన్ని పట్టుకున్న చిరు.. ఆ ఫొటోను షేర్‌ చేస్తూ, 'పారిస్‌ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషకరమైన క్షణం. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌. పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నా'అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత చిరు నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బింబిసార వంటి సూపర్‌ హిట్ విజయాన్ని అందించిన వశిష్ట దర్శకత్వం వహిస్తుండడంతో కూడా విశ్వంభర అచనాలు మించిపోయింది. మరి ఈ సినిమాతో చిరు ఇండస్ట్రీని షేక్‌ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories