Bigg Boss 8 Telugu: ఈ వీకెండ్‌కి బిగ్ ట్విస్ట్.? ఎలిమినేషన్ లేకుండానే గంగవ్వ..
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా కొనుసోగుతోంది. ప్రస్తుతం 8వ వారంలోకి అడుగు పెట్టిన షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా కొనుసోగుతోంది. ప్రస్తుతం 8వ వారంలోకి అడుగు పెట్టిన షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా హౌజ్లకి కొందరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంట్రీ ఇచ్చిన వారిలో గంగవ్వ ఒకరు. మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ మై విలేజ్ షో పేరుతో నెటిజన్లను ఆకట్టుకుంది.
కాగా గంగవ్వ గత సీజన్‌లో కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆరోగ్యం సహకరించని కారణంగా గంగవ్వ తనంతట తానే హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. కేవలం ఐదు వారాలు మాత్రమే ఉండి వాలంటీరీగా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.
అయితే తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. ప్రస్తుతం హౌజ్‌లో తనదైన శైలిలో గేమ్ ఆడుతోంది. అయితే వయసు రీత్యా ఫిజికల్ గేమ్స్‌ను మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. అయితే తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ నవ్వులు పూయిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం. గంగవ్వ ఈ సీజన్‌లో కూడా ఆట మధ్యలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయంటూ గత శనివారం ఎపిసోడ్ లో నాగార్జునతో కూడా చెప్పుకుని బాధపడ్డారామె. ఈ కారణంగానే గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ వీకెండ్ గంగవ్వ ఎలిమినేట్ కానుందని వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire