Game Changer: చెర్రీ ఫ్యాన్స్‌ గెట్ రడీ.. గేమ్‌ ఛేంజర్‌ టీచర్‌ వచ్చేది అప్పుడే..

Game Changer
x

Game Changer

Highlights

దసరా కానుకగా గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ విడుదల చేస్తామని దిల్‌రాజు కన్ఫామ్‌ చేశారు.

రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. భారతీయుడు 2 వంటి పరాజయం తర్వాత శంకర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న సినిమా కావడం, పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ట్రిపులార్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా కావడం కూడా ఈ మూవీపై అంచనాలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా టీజర్‌ ఎప్పుడొస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా శంకర్‌ సినిమాలు అంటేనే చాలా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటాయనే టాక్‌ ఉంటుంది. తాజాగా జరుగుతోన్న పరిణామాలు కూడా ఇది నిజమనే వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

ఇదిలా ఉంటే... గేమ్‌ ఛేంజర్‌కు సంబంధించి తాజాగా నిర్మాత దిల్‌రాజు గుడ్ న్యూస్‌ చెప్పారు. దసరా కానుకగా గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ విడుదల చేస్తామని దిల్‌రాజు కన్ఫామ్‌ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శంకర్‌ రాజకీయ, సామాజిక అంశాలను మేలవించిన తెరకెక్కిస్తున్న తెలుస్తోంది. ఇందులో చెర్రీ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories