Bigg Boss Telugu 8: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌‌తో సెల్ఫ్ నామినేషన్.. కట్‌చేస్తే.. అభయ్‌కు ఊహించని షాక్..

abhay naveen eliminated from bigg boss 8 telugu
x

Bigg Boss Telugu 8: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌‌తో సెల్ఫ్ నామినేషన్.. కట్‌చేస్తే.. అభయ్‌కు ఊహించని షాక్..

Highlights

కాన్ఫిడెన్స్‌ ఉండాలి. కానీ, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఉంటే కొన్నిసార్లు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అచ్చం ఇలాంటిదే బిగ్ బాస్ హౌస్‌లో చోటు చేసుకోనుంది. ఓ...

కాన్ఫిడెన్స్‌ ఉండాలి. కానీ, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఉంటే కొన్నిసార్లు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అచ్చం ఇలాంటిదే బిగ్ బాస్ హౌస్‌లో చోటు చేసుకోనుంది. ఓ కంటెస్టెంట్ దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోబోతున్నాడు. మూడో వారం అభయ్‌ నవీన్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ అయిపోయింది. కాబట్టి అభయ్‌ నవీన్‌ ఎలిమినేషన్‌ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే, అభయ్‌ నవీన్ ఈ వారం ఎలిమినేట్‌ లిస్టులో లేడు. కానీ, తన ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎలిమినేట్ కాబోతున్నాడు.

సెల్ఫ్‌ నామినేషన్..

గత సోమవారం జరిగిన నామినేషన్స్‌‌లో అభయ్‌, నిఖిల్‌ ఇద్దరూ చీఫ్స్‌గా నియమితులయ్యారు. అయితే, వీరిలో ఒకరు నామినేట్‌ కావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో అభయ్‌, నిఖిల్‌ తీవ్రంగా మాట్లాడుకున్నారు. నిఖిల్‌ నామినేట్‌ అవుతానని అభయ్‌‌కు చెప్పాడు. అయితే, అందుకు అభయ్ ససేమీరా అన్నాడు. కచ్చితంగా సేవ్‌ అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తానే నామినేషన్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించుకున్నాడు.

హౌస్‌లో చేసిందేమీ లేదు..

హౌస్‌లో అభయ్ పెద్దగా చేసింది ఏం లేదు. చీఫ్‌ అయ్యాననే తల పొగరుతో, అందరి సపోర్ట్ ఉందంటూ ఎంతో గొప్పగా తనలో తాను ఊహించుకున్నాడు. దీంతో చీఫ్‌గా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ను కూడా బండ బూతులు తిట్టేశాడు. దీంతో కోపగించిన బిగ్‌బాస్‌ అభయ్‌ని చీఫ్‌‌గా తొలగించాడు.

తిట్టిపోస్తోన్న జనం..

షో చూసే వాళ్లంతా కూడా అభయ్ ఎలిమినేట్ కావడమే మంచిదని కోరుకుంటున్నారు. హౌస్‌మేట్స్‌ని చెడగొడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అభయ్‌కి పెద్దగా ఓట్లు వేయలేదు. దీంతో తను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories