The GOAT Life OTT: ఆరోజు రానే వచ్చేసింది.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..!

The GOAT Life OTT: ఆరోజు రానే వచ్చేసింది.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..!
x

The GOAT Life OTT: ఆరోజు రానే వచ్చేసింది.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..!

Highlights

The GOAT Life OTT: మాలీవుడ్ స్టార్‌ హీరో పృద్ధిరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ది గోట్‌ లైఫ్‌.

The GOAT Life OTT: మాలీవుడ్ స్టార్‌ హీరో పృద్ధిరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ది గోట్‌ లైఫ్‌. బెన్యమిన్‌ రాసిన ఆడుజీవితం నవాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మార్చి 28వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వాస్తవ సంఘటనల నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో చూస్తున్నారు. సాధారణంగా ప్రస్తుతం సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్న నేపథ్యంలో గోట్‌ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే నాలుగు నెలలు దాటినా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తాజాగా ఎట్టకేలకు ది గోట్‌ లైఫ్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జున్‌ 19వ తేదీ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌తో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో గోట్‌ మూవీని వీక్షించండి. కాగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు రాబట్టడం విశేషం.


Show Full Article
Print Article
Next Story
More Stories