ఏకంగా మహిళా జడ్జీనే ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్ ... అక్కడి నుండి ఆమె అలిగి...

ఏకంగా మహిళా జడ్జీనే ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్ ... అక్కడి నుండి ఆమె అలిగి...
x
Highlights

ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మహిళ జడ్జీకి వింత అనుభవం ఎదురైంది. ఆ షోలో కంటెస్టెంట్ గా ఉన్నా ఓ వ్యక్తి ఆమెను ఏకంగా ముద్దుపెట్టుకున్నాడు. దీనితో ఆమె...

ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మహిళ జడ్జీకి వింత అనుభవం ఎదురైంది. ఆ షోలో కంటెస్టెంట్ గా ఉన్నా ఓ వ్యక్తి ఆమెను ఏకంగా ముద్దుపెట్టుకున్నాడు. దీనితో ఆమె అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఇండియన్ ఐడిల్ 11 లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ షోలో పాల్గొన్న గాయని గాయకులు పాడిన పాటలకి గాను జడ్జిమెంట్ ఇచ్చేందుకు ప్రముఖ గాయకులూ అనూ మాలిక్ , విశాల్, దాడ్లని, నేహా కక్కర్ జడ్జీలుగా పాల్గొన్నారు. అయితే ఇందులో పాట పాడడానికి వచ్చిన ఓ కంటెస్టెంట్ పాట పాడిన అనంతరం అతన్ని గుర్తుపట్టాల్సిందిగా న్యాయనిర్ణేత అయిన నేహా కక్కర్ ని కోరాడు.

దీనితో ఆమె స్టేజ్ పైకి వచ్చింది. అప్పుడు సదరు కంటెస్టెంట్ ఆమెకి కొన్ని బహుమతులను ఇచ్చాడు. దానికి కృతజ్ఞతగా నేహా అతన్ని కౌగులించుకుంది. కానీ అతను మాత్రం ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె బుగ్గలపై ముద్దుపెట్టేశాడు. అక్కడ ఉన్నా యాంకర్ , మిగతా జడ్జీలు ఇది చూసి షాక్ అయ్యారు. అతన్ని అక్కడినుండి పంపించారు. ఉహించని సంఘటన ఎదురవడంతో అక్కడినుండి నేహా అలిగి వెళ్ళిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories