5 Years for Srimanthudu : మహేష్ శ్రీమంతుడుకి ఐదేళ్ళు!

5 Years for Srimanthudu : మహేష్ శ్రీమంతుడుకి ఐదేళ్ళు!
x
5 Years for Srimanthudu
Highlights

5 Years for Srimanthudu : ఒక సినిమాని అందరూ ఆదరిస్తే దాన్ని హిట్ సినిమా అని అంటారు. అదే సినిమా అందరిని ఆలోచింపజేస్తే

5 Years for Srimanthudu : ఒక సినిమాని అందరూ ఆదరిస్తే దాన్ని హిట్ సినిమా అని అంటారు. అదే సినిమా అందరిని ఆలోచింపజేస్తే దాన్ని గొప్ప సినిమా అంటారు. అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో చాలా తక్కువేనని చెప్పాలి. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు.. పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన ఓ తండ్రి.. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు...ఈ రెండు జీవితాల మధ్య ఓ ఊరు దత్తత కథాశంతో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి నేటికి ఐదేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* దూకుడుతో కలిపి వరుసగా మూడు హిట్లు కొట్టిన మహేష్ బాబు అప్పటికే సుకుమార్, శ్రీనువైట్లకి డేట్స్ ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత పూరీ, సురేందర్ రెడ్డి మొదలగు దర్శకులు కథలు చెపుతున్నా మహేష్ కి నచ్చడం లేదు, అదే టైంలో మహేష్ కి కొరటాల శివ ఓ దత్తత కథాశంతో ఓ కథను చెప్పాడు.

* మిర్చి తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమాని ప్లాన్ చేశాడు కొరటాల... కథ విషయంలో కొరటాలకే ఎక్కడ క్లారిటీ లేకా సినిమాని పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనుకున్న అది కుదరలేదు..

* ఇక మహేష్ బాబుకి కొరటాల చెప్పిన కథ బాగా నచ్చింది. వెంటనే డేట్స్ ఇచ్చేశాడు.

* ముందుగా ఈ సినిమాకోసం వేరే నిర్మాతలను అనుకున్నారు. కానీ ఆ తరవాత డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఇక ఇదే సినిమాతో మహేష్ బాబు కూడా నిర్మాతగా మారాడు.

* ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబును స్వయంగా మహేష్ బాబే రికమెండ్ చేశారు.

* సినిమాకి ముందు దేవీ అందించిన పాటలు అదిరిపోయాయి.. ఇక చారుశిల పాట విని హీరోయిన్ కి అదే పేరు పెట్టేశారు కొరటాల..

* సినిమాకి ముందుగా మంచివాడు,బుద్దిమంతుడు అనే టైటిల్స్ ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా శ్రీమంతుడు అని ఫిక్స్ చేశారు.

* బహుబలి మొదటి పార్ట్ వచ్చిన నెల రోజులకి శ్రీమంతుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకేసారి 2500 స్క్రీన్లలో శ్రీమంతుడు చిత్రాన్ని విడుదల చేశారు.

* సినిమాకి మొదటి ఆట నుంచి మంచి టాక్ వచ్చింది. గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన అందరిని కదిలించింది.

* సినిమా విడుదలయ్యాక ఎక్కడ చూసిన శ్రీమంతుడు గురించే చర్చ.. అంతలా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి.. బాహుబలి లాంటి ప్రభంజనం ముందు కూడా ఈ సినిమా తట్టుకొని నిలబడింది.

* ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు కొరటాల శివ..

* సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ ఈ సినిమాకి కనెక్ట్ అయి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతలా ప్రభావం చూపించింది ఈ సినిమా..

* శ్రీమంతుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 కోట్లు, వరల్డ్ వైడ్ గా 85 కోట్లను కొల్లగొట్టింది. 57 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే దాదాపుగా 30 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..

* 185 సెంటర్లలో 50 రోజులు, తొమ్మిది సెంటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంది ఈ సినిమా..

* ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.

* ఈ సినిమా కథాశంకి స్వయంగా ప్రధాని మోడీ కూడా ఫిదా అయిపోయారు.

* ఇక యూట్యూబ్ లో కూడా వంద మిలియన్లు వ్యూస్ ని అందుకుంది ఈ చిత్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories