OTT: ఓటీటీలో వచ్చేస్తున్న '35 చిన్న కథ కాదు'.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

35 chinna katha kaadu OTT streaming from AHA from october 2nd
x

OTT: ఓటీటీలో వచ్చేస్తున్న '35 చిన్న కథ కాదు'.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

Highlights

ఇదిలా ఉంటే.. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

నివేదా థామ్‌, విశ్వదేవ్‌ రాచకొండ, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం '35 చిన్న కథ కాదు'. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబర్‌ 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేశారు. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నివేదా థామస్‌ తల్లి పాత్రలో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే.. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహా వేదికగా ‘35: చిన్న కథ కాదు’ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. “ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది. ఈ బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్టోబర్ 2 నుంచి ఆహాలో అందుబాటులోకి వస్తుంది” అని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే..

ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్) తిరుపతిలో బ‌స్ కండ‌క్టర్‌ గా పని చేస్తారు. ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్) తన భర్త, ఇద్దరు పిల్లలే ప్రపంచంగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇద్దరు పిల్లల్లో పెద్దబ్బాయి చదువులో రాణించడు. కానీ లాజికల్‌ ప్రశ్నలు అడుగుతుంటాడు. ముఖ్యంగా లెక్కలు అస్సలు రావు. ఈ క్రమంలోనే మ్యాథ్స్ టీచర్ చాణక్య(ప్రియ‌ద‌ర్శి) కూడా అతడికి మొద్దు అనే ముద్ర వేసి క్లాస్ లో చివరి బెంచీలో కూర్చోబెడతాడు. ఆరో తరగతి పరీక్షల్లో మ్యాథ్స్‌లో ఫెయిల్ అవుతాడు.

దీంతో స్కూల్‌ యాజమాన్యం ఆ అబ్బాయి స్కూల్ లో ఉండాలంటే మ్యాథ్స్ లో 35 మార్కులు తెచ్చుకోవాలని తేల్చి చెబుతుంది. దీంతో ఇంతకీ ఆ కుర్రాడు 35 మార్కులు తెచ్చుకున్నాడా? లేదా? కొడుకు పాస్ అయ్యేందుక తల్లి ఏం చేసింది.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మద్య తరగతి కుటుంబాల్లో జరిగే అంశాలను, మార్కులతో లింక్‌ చేసి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం.


Show Full Article
Print Article
Next Story
More Stories