34 Years For Kaliyuga Pandavulu : వెంకటేష్ @34 ఏళ్ళు

34 Years For Kaliyuga Pandavulu : వెంకటేష్ @34 ఏళ్ళు
x
Venkatesh Kaliyuga Pandavulu @34 years
Highlights

34 Years For Kaliyuga Pandavulu : హీరో వెంకటేష్.. ఏ జోనర్ లో సినిమా అయిన సరే తన అద్భుతమైన నటనతో అన్ని రకాల ప్రేక్షకులను కట్టిపడేసే

34 Years For Kaliyuga Pandavulu : హీరో వెంకటేష్.. ఏ జోనర్ లో సినిమా అయిన సరే తన అద్భుతమైన నటనతో అన్ని రకాల ప్రేక్షకులను కట్టిపడేసే కథానాయకుడు..అందుకే విక్టరీ అయన ఇంటిపేరు అయింది. చంటిగా అమాయకమైన యువకుడిగా, అందమైన సుందరకాండ కి లెక్చరర్ గా, బలపం పట్టి భామ బళ్లో అఆఇఈ నేర్చుకున్న బొబ్బిలిరాజాగా, సింగిల్ హ్యాండ్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన గణేష్ గా వెంకటేష్ మంచి పేరు సంపాదించుకున్నారు. అయన మొదటగా నటించిన కలియుగ పాండవులు చిత్రానికి నేటితో 34 ఏళ్ళు నిండాయి..

ఈ సినిమాకి కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, వెంకటేష్ తండ్రి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 1986 ఆగస్టు 14న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి గాను వెంకటేష్ నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ అందుకున్నాడు. ఇందులో వెంకటేష్ సరసన కుష్బూ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకి కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం.. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు. మొదటగా ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణతో చేద్దామని రామానాయుడు అనుకున్నారు. కానీ అయన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో విదేశాల్లో ఉన్న వెంకటేష్ ని పిలిపించి హీరోగా వెండితెరకి పరిచయం చేశారు.

కే. రాఘవేంద్రరావు పరిచయం చేసిన మొదటి హీరో కూడా వెంకటేష్ కావడం విశేషం.. మొదటి సినిమాతో నంది అవార్డు అందుకున్న వెంకటేష్ ఈ 34 ఏళ్ళు తన కెరీర్ లో చాలా నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ మంచి పేరు సంపాదించుకున్నాడు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల తర్వాత నాలుగో స్థంబంగా వెంకటేష్ నిలిచారు.. ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ మూవీస్ చేసిన హీరో కూడా వెంకటేష్ కావడం మరో విశేషం.. ఇందులో దాదాపుగా అన్ని హిట్లే..



Show Full Article
Print Article
Next Story
More Stories