Gang Leader 30 Years: చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిన గ్యాంగ్ లీడర్..

GangLeader
x

గ్యాంగ్ లీడర్ (వికీపీడియా )

Highlights

Gang Leader 30 Years: ఈ సినిమా విడుదల త‌ర్వాతే చిరంజీవి నటన, స్టైల్, డ్యాన్స్ అప్ప‌టి యూత్ ను క‌ట్టిప‌డేశాయి

Gang Leader 30 Years: మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. 1991 మే 5న విడుదలై అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. గ్యాంగ్ లీడర్ 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది గ్యాంగ్ లీడర్. ఈ సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది.

ఈ సినిమా విడుదల త‌ర్వాతే చిరంజీవి నటన, స్టైల్, డ్యాన్స్ అప్ప‌టి యూత్ ను క‌ట్టిప‌డేశాయి. గ్యాంగ్ లీడర్‌లో ప్ర‌తి స‌న్నీవేశం ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయించాయి. ఈ సినిమాతో చిరు మెనియా స్టార్ట్ అయ్యింది. విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా కూడా చిరంజీవికి హిట్ ఇచ్చింది. చిరంజీవి స‌ర‌స‌న‌ విజయశాంతి హీరోయిన్ గా చేసింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం ప‌డింది.

'గ్యాంగ్‌ లీడర్‌' పాటలు బప్పీలహరి అందించాడు. సింహాస‌నం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బప్పీలహరి ఈసినిమాకు పాట‌లు అందించాడు. ఈ సినిమాలో ఆరు పాటు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆరు పాట‌ల‌కు బాలసుబ్రహ్మ‌ణ్యం- చిత్ర ఆల‌పించ‌డం విశేషం. భువన చంద్ర, వేటూరి సుందర రామమూర్తి లిరిక్స్ అందించారు. మాగంటి మురళీమోహన్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories