Pradeep‌: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రీ రిలీజ్ బిజినెస్

30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
x

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? 

Highlights

బుల్లితెర యాంకర్ ప్రదీప్, హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

బుల్లితెర యాంకర్ ప్రదీప్, హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు మున్నా డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? టైటిల్‌తో అలరించబోతున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జనవరి 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్ల తెలుస్తోంది.

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతుంది. ఈ సినిమా అప్‌డేట్స్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories