2024 Hurun Rich List: 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో టాప్ 6 స్థానంలో నిలిచిన జూహీ చావ్లా..ఆమె ఆస్తి విలువ ఎంతంటే..?

2024 Hurun Rich List Juhi Chawla is India
x

2024 Hurun Rich List: 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో టాప్ 6 స్థానంలో నిలిచిన జూహీ చావ్లా..ఆమె ఆస్తి విలువ ఎంతంటే..?

Highlights

2024 Hurun India Rich List: 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేసిన టాప్ 10 సెల్ఫ్-మేడ్ మహిళల జాబితాలో నటి కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని జుహీ చావ్లా ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

2024 Hurun India Rich List: 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేసిన టాప్ 10 సెల్ఫ్-మేడ్ మహిళల జాబితాలో నటి కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని జుహీ చావ్లా ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూహీ చావ్లా, రూ. 4600 కోట్ల సంపదతో ఆరో స్థానంలో నిలవగా, రాధా వెంబు రూ. 47,500 కోట్ల సంపదతో తొలి స్థానంలో నిలిచారు. ఇక, ఫల్గుణి నాయర్ అండ్ ఫ్యామిలీ, జయశ్రీ ఉల్లాల్, కిరణ్ మజుందార్-షా వంటి పేర్లు కూడిన జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జూహీ చావ్లా కంటే ముందు నేహా నార్ఖేడే కుటుంబం రూ. 4,900 కోట్లతో 5వ స్థానం దక్కించుకోగా, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్ర కె నూయి రూ. 3,900 కోట్లతో ఈ జాబితాలో ఉన్నారు. సెల్ఫ్ మేడ్ మహిళల జాబితాతో పాటు, 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో సినిమా టైటాన్స్ జాబితాలో షారుఖ్ ఖాన్ తర్వాత జుహీ చావ్లా కూడా స్థానం సంపాదించుకుంది.

జుహీ చావ్లా 1995 నుండి ది మెహతా గ్రూప్ ఛైర్మన్ జే మెహతాను వివాహం చేసుకున్నారు. GQ నివేదిక ప్రకారం, ఈ జంట అనేక విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ దంపతులు ప్రస్తుతం ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్ లో అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారు. జూహీ చావ్లా ఐపిఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ సహ యజమానిగా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022 నాటికి KKR విలువ 1.1 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9,139 కోట్లుగా అంచనా వేశారు.

జూహీ చావ్లా కార్ల కలెక్షన్ విషయానికి వస్తే ఆమె వద్ద ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ కారు ఉంది. దీని ధర రూ. 3.3 కోట్లు. అలాగే జూహీ వద్ద మరో లగ్జరీ కారు BMW 7 సిరీస్ ఉంది. దీని ధర రూ. 1.8 కోట్లు. జూహీ చావ్లా కార్ల కలెక్షన్ లో రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్ క్లాస్, రూ. 1.2 కోట్ల విలువైన జాగ్వార్ ఎక్స్‌జె, రూ. 1.36-2 కోట్ల మధ్య ధర కలిగిన పోర్స్చే కార్లు ఉన్నాయి

జూహీ చావ్లా తన సహనటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి, ఆమె డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఆమె ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ (2000)తో మొదలై మూడు చిత్రాలను నిర్మించింది.

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, భారతదేశంలో ఇప్పుడు రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులు సుమారు 1,539 మంది ఉన్నారు. గతేడాది కంటే ఇది 220 మంది ఈ జాబితాలో పెరగడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories