టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..విడుదల తేదీపై ముందే ఖర్చీఫ్.. 2021 సినిమాల లిస్ట్ ఇదే

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..విడుదల తేదీపై ముందే ఖర్చీఫ్.. 2021 సినిమాల లిస్ట్ ఇదే
x

టాలీవుడ్ మూవీస్

]

Highlights

సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ మొదలైంది. ఎప్పుడు లేని విధంగా అన్ని సినిమాలు వరుస పెట్టి రిలీజ్ డేట్స్ ఆనౌన్స్ చేస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ మొదలైంది. ఎప్పుడు లేని విధంగా అన్ని సినిమాలు వరుస పెట్టి రిలీజ్ డేట్స్ ఆనౌన్స్ చేస్తున్నాయి. గతం ఒకటి రెండు సినిమాలు మాత్రమే థియేటర్లోకి ఎప్పుడు వచ్చేదో ముందే ప్రకటిస్తున్నాయి. ఆ సమయంలోగా షూటీంగ్ పూర్తి చేసుకొని చెప్పిన టైమ్ కి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

అయితే తాజా సినిమాల లెక్కలు చూస్తే ఆశ్ఛర్యం కలగకమానదు. ఎందుకంటే ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా పెద్ద హీరోల మూవీల నుంచి చిన్ని చిత్రాల వరకూ అదే బాట పట్టాయి. మేము థియేటర్లలోకి రాబోది ఆ రోజు అంటూ ముందుగా తేదీలను ప్రకటిస్తూ.. ఖర్చీఫ్ వేసుకుంటున్నాయి. అయితే అన్ని సినిమాలు చెప్పిన టైంకి వస్తాయా? లేదా రిలీజ్ రోజు దగ్గర పడే సమయంలో చిత్రీకరణ కంప్లీట్ కాలేదని మళ్లీ తేదీ మారుస్తాయా? చూడాలి.

గతంలో కరోనావైరస్ కు ముందు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మార్చిన సంగతి తెలిసిందే. బాహుబలి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక ఈ ఏడాది దసరా కనుకగా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తానని ప్రకటించారు. పెద్ద మూవీ ఒక్కటి విడుదలై విజయం సాథిస్తే రెండు మూడు వారాల వరకు మరో సినిమా దాని దరిదాపుల్లోకి రావు. ఈ నేపథ్యంలో చిరంజీవి నటించిన ఆచార్య, వెంకటేష్ నటించి నారప్ప సినిమాలకు మద్యలో ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉంది. అలాగే చిన్నసినిమాలు జాంబీ జోనర్లో తెరకెక్కుతున్న జీ జాంబీ, జాంబీ రెడ్డి ఫిబ్రవరి ఐదవ తేదీనే వస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

ఇక తాజాగా కేంద్రం ఫిబ్రవరి 1 నుంచి లాక్ డౌన్ నిబంధలనలో భాగంగా థియేటర్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసింది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది చిత్రీకరణ నిలిచిపోయిన సినిమాలు అన్ని శరవేగంగా షూటింగ్స్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విడుదల తేదీలను కూడా ప్రకటిస్తున్నాయి. మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' వెంకటేష్ 'నారప్ప'.. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'..పవర్ స్టార్ కూడా 'వకీల్ సాబ్'.. వరుణ్ తేజ్ 'గని'.. వెంకటేష్-వరుణ్ తేజ్ F3, యష్ 'కేజీఎఫ్', శర్వానంద్ శ్రీకారం, మహాసముద్రం చిత్రాల విడుదల తేదీలను అనౌన్స్ చేశాయి.

2021 ఏ రోజు ఏ సినిమా రానుందో సినిమాలను చూద్దాం.

'సర్కారు వారి పాట' 2022సంక్రాతికి






వెంకటేష్ 'నారప్ప'..


మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'..


పవర్ స్టార్ కూడా 'వకీల్ సాబ్'


వరుణ్ తేజ్ 'గని'..




వెంకటేష్-వరుణ్ తేజ్ F3,

యష్ 'కేజీఎఫ్',


శర్వానంద్ శ్రీకారం,


శర్వానంద్ మహాసముద్రం





Show Full Article
Print Article
Next Story
More Stories