Pushpa 2: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుకుమార్... ఫ్లవర్ కాదు, ఫైర్!

Pushpa Director Sukumar
x

Pushpa Director Sukumar: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

Highlights

Director Sukumar: హిట్లు ఫ్లాపులకు అతీతంగా గౌర‌వాన్ని పొందే దర్శకులు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉంటారు.

Director Sukumar: హిట్లు ఫ్లాపులకు అతీతంగా గౌర‌వాన్ని పొందే దర్శకులు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉంటారు. కొన్నిసార్లు ఫ్లాపు సినిమాలు సైతం ఆయా దర్శకుల టేకింగ్ లో తన మార్క్ ఏమిటో చూపిస్తుంటాయి. సుకుమార్ అలాంటి ద‌ర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఆయన.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాతో ఈ లెక్కల మాస్టారు డైరెక్టర్ గా మారారు. ఆర్య సినిమాతో అప్పటి వరకు ఎవరు తీయని సరికొత్త ప్రేమకథను వెండితెర మీద ఆవిష్కరించారు. ఆర్య సినిమా సుకుమార్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆర్య సినిమా 7 మే 2004న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆర్య సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్య సినిమా నుంచి సినిమా మేకింగ్ లో సరికొత్త పంథాను చూపించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను సుకుమార్ ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఆర్య సినిమా తరువాత తను తీసిన రెండో సినిమా ‘జగడం’. ఇది సుకుమార్ కెరీర్ లో మరో విభిన్న చిత్రం. ఈ సినిమా ఫ్లాప్ అంటారు కానీ, ఇప్పటికీ దీనికి వీర భక్తులున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఈ సినిమా మాస్ హీరోగా మార్చింది. అప్పటివరకు యూత్ లో ట్రెండింగ్ గా ఉన్నా గ్యాంగ్స్ , గొడవలూ ఎంత ప్రమాదకరమో సుకుమార్ కొత్తగా తెర మీద చూపించారు.

ఇక మహేశ్ బాబు హీరోగా తీసిన ‘వ‌న్ – నేనొక్కడినే’ చిత్రం ఎవ‌రికీ అర్థం కాలేదనే ఆరోపణలతో కొట్టుకుపోయింది. అయితే, ఆ సినిమాను మాస్టర్ పీస్ అంటూ నెత్తిమీద పెట్టుకున్న వాళ్లున్నారు. అది డైరెక్టర్ సుకుమార్ మార్క్‌. ‘1: నేనొక్కడినే’ సినిమా హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు సుక్కు. ఆ తరువాత వచ్చిన ‘ఆర్య 2’ క్యారెక్టరైజేషన్ ఆధారంగా భావోద్వేగాలను నడిపించే వ్యక్తిగా చూపించి సుకుమార్ సక్సెస్ అయ్యాడు.

ఆ తరువాత నాగ చైతన్యతో తెరకెక్కించిన “100% లవ్” సినిమా యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎమోషనల్ గా ఎంతగానో ఆకట్టుకుంది.

అలాంటి డైరెక్టర్ విలేజి బ్యాక్ డ్రాప్‌లో మాస్ కమర్షియల్ తీస్తే ఎలా ఉంటుందో ‘రంగ‌స్థలం’ నిరూపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమా చరిత్రలో అది కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాతో రాంచరణ్ లోని లోతైన నటుడిని సుకుమార్ బయటకు తీశాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఆ తరువాత వచ్చిన ‘పుష్ప’ చిత్రం డైరెక్టర్ సుకుమార్ రేంజిని అమాంతంగా ఎక్కడికో తీసుకుపోయింది. ఈ సినిమాతో ఇంత వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు. పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇక ఇప్పుడు పుష్ప-2 సినిమా ప్రపంచంలో సృష్టిస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.

ఈ సినిమా కోసం సుకుమార్ మూడేళ్లు కష్టపడ్డారు. క్రియేటివిటీ, క‌మ‌ర్షియాలిటీలను మిక్స్ చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని పుష్ప 1 నిరూపించింది. ఇదే మ్యాజిక్ ను ‘పుష్ప 2’కు కూడా అప్లై చేసి విజయం సాధించాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నారు.

యాంటీ సోష‌ల్ ఎలిమెంట్ లాంటి పుష్ప క్యారెక్టర్ ను హీరోను చేయడమే ఛాలెంజ్.. అలాంటిది అతడిని సూప‌ర్ హీరోగా మార్చ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఆ పాత్ర దాని తాలుకూ ల‌క్షణాలూ మాస్‌ని ప‌ట్టేస్తే త‌ప్ప ఇంత వైబ్ క‌నిపించ‌దు. రైటింగ్ లో సుక్కు చేసిన మ్యాజిక్ వ‌ల్లే ఇది సాధ్యమైంది.

‘పుష్ప’ అనే యూనివర్స్ ను బిల్డ్ చేయ‌డం, వాటి చుట్టూ పాత్రలను సృష్టించ‌డం అనే పాయింట్ దగ్గరే సుకు భారీ హిట్ అందుకున్నారు. ‘పుష్ప‌’తో వ‌చ్చిన బ‌జ్ పార్ట్ 2తో వంద రెట్లు పెరిగింది. ఈసారి హిట్టు కొడితే లెక్క రూ.1000 కోట్ల నుంచి మొద‌ల‌వుతుందని సుకుమార్‌కి కూడా తెలుసు. అందుకే ప్రతీ సీన్ చెక్కుతూ వెళ్లాడు. దాని వ‌ల్ల సినిమా లేటయింది, బ‌డ్జెట్లు, వ‌డ్డీలూ త‌డిసి మోపెడ‌య్యాయి. అయినా స‌రే.. సుకుమార్ వెన‌క్కి త‌గ్గలేదు. పుష్ప ది రైజ్ హిట్ కొట్టాక‌, మూడేళ్ల పాటు ఒకే సినిమాకి కేటాయించ‌డం హీరోల‌కే కాదు, ద‌ర్శకుల‌కూ రిస్క్ ఫ్యాక్టరే. కానీ ఆ రిస్క్‌ని భ‌రించాడు డేరింగ్ డైరెక్టర్ సుకుమార్‌.

పుష్ప సిరీస్‌తో రాజమౌళి తరువాత పాన్ ఇండియా మార్కెట్లో మరో సెన్సేషనల్ తెలుగు డైరెక్టర్‌గా అవతరించారు సుకుమార్. ఇప్పుడు సుకుమార్ ఫిల్మ్ కెరీర్‌ను... పుష్ప సినిమాకు ముందు తరువాత అనే రెండు చాప్టర్స్‌గా చెప్పుకోవాల్సిందే. ఆయన తరువాత ప్రాజెక్ట్ ఏ రేంజిలో ఉంటుందన్నది ప్రేక్షకుల ఊహకే వదిలేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories