19 Years Of Nuvvu Naaku Nachav : ఇంటిల్లపాదీ నవ్వుతూ మెచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్'

19 Years Of Nuvvu Naaku Nachav : ఇంటిల్లపాదీ నవ్వుతూ మెచ్చిన నువ్వు నాకు నచ్చావ్
x
Highlights

19 Years Of Nuvvu Naaku Nachav : అది 2000 సంవత్సరం .. కలిసుందాం రా, జయం మనదేరా లాంటి సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్నారు

19 Years Of Nuvvu Naaku Nachav : ఎప్పుడైనా విజయాన్ని మించిన కిక్ ఏదీ ఉండదు అందులోనూ సినిమా ఇండస్ట్రీలో. అప్పటివరకూ ఎంత ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడేవారు ఒక్క సినిమాతో మొత్తం ఇండస్ట్రీ మీద బలమైన ముద్ర వేస్తారు. అది చాలాకాలం చెరిగిపోదు. అటువంటి ముద్రే త్రివిక్రమ్ శ్రీనివాస్. చిటపట చినుకుల్లా మొదలైన ఈ మాటల మాంత్రికుని ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్ లో చెరగని మాటల సునామీలా మారిపోయింది. ఈయన తొలిరోజుల్లో మాటలు రాసిన ప్రతి సినిమా ఓ సంచలనం. స్వయంవరం..నువ్వేకావాలి..ఇలా వరుస..ఇందులో వచ్చిన మరో మాటల మణిహారం నువ్వునాకునచ్చావ్! ఒక పక్క ఫ్యామిలీ హీరోగా..మరోపక్క యాక్షన్ హీరోగా విక్టరీ వెంకటెష్ టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతున్న సమయంలో చిన్న ఫ్యామిలీ డ్రామాకి లవ్..సెంటిమెంట్ పూత పూసి..దానికి మాటల మసాలా కలిపి ప్రేక్షకులకు విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా నువ్వునాకునచ్చావ్! ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ వెంకటేష్ నటన కి ఎంతలా కనెక్ట్ అయిపోయారో..త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు. అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉంది.

అది 2000 సంవత్సరం .. కలిసుందాం రా, జయం మనదేరా లాంటి సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్నారు హీరో వెంకటేష్. ఆ తరవాత కొత్త కథలని వింటున్నారు. కానీ ఏది నచ్చడం లేదు.. అప్పటికి వెంకటేష్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరుంది. కామెడీ కూడా ఆదరగోడుతాడు.. మరి అలాంటి వెంకటేష్ కి ఫ్యామిలీ కం కామెడీ సినిమా పడితే ఎలా ఉంటుంది. అవును.. సరిగ్గా 2001 సంవత్సరంలో వెంకీకి 'నువ్వు నాకు నచ్చావ్' అనే సినిమా వచ్చింది. ఇంకేముంది సినిమా సూపర్ హిట్.. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.. అలాంటి నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి నేటితో 19 ఏళ్ళు పూర్తి అయ్యాయి.. మరి ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకోసం ...

* నువ్వే కావాలి సినిమాకి గాను విజయభాస్కర్ , త్రివిక్రమ్ వర్క్ నచ్చి నెక్స్ట్ సినిమాకి గాను ముందే అడ్వాన్స్ ఇచ్చారు స్రవంతి'రవికిషోర్ '. ఆ సినిమానే నువ్వు నాకు నచ్చావ్!

* విజయభాస్కర్ , త్రివిక్రమ్ కలిసి రెండు నెలల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు.. సినిమా సబ్జెక్టు ని టీం మొత్తానికి వినిపిస్తే అందరు సినిమా స్క్రిప్ట్ కి వందకు వంద మార్కులు ఇచ్చేసారు. సినిమా స్టొరీ బాగా నచ్చడంతో హీరో కోసం వేట మొదలైంది.. ముందుగా మళ్ళీ తరుణ్ తోనే చేద్దామనుకున్నారు.. ఆ తర్వాత సీనియర్ హీరో కావాలని ఆ అప్రోచ్ ని మానుకున్నారు..

* రవికిషోర్‌కి ప్రొడ్యూసర్ డి.సురేశ్‌బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచీ ప్రపోజల్ వచ్చింది. "విజయ్‌భాస్కర్ - త్రివిక్రమ్‌లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?'' దీనితో ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా సెట్ అయ్యాడు ..

* త్రివిక్రమ్ వెళ్లి వెంకటేష్ కి కథ చెప్పడంతో వెంకటేశ్ ఫ్లాట్ అయ్యారట. ''వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్'' అని కితాబు కూడా ఇచ్చారట. కానీ సినిమాలో సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే కథ నడిచిపోతోంది. ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ కావాలి కదా! అని డౌట్ చెప్పడంతో సినిమాలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసారు , ఆ క్యారెక్టరే బ్రహ్మానందం. సినిమాలో ఇది ఎంత బాగా నవ్వుల పువ్వుల్ని పూయించిందో అందరికీ తెలిసిందే.

* సినిమాకి అన్ని ఓకే అయ్యాయి, ఇంకా రెండు పాత్రలు మిగిలిపోయాయి . ఒకటి హీరోయిన్ పాత్ర కాగా, మరొకటి హీరోయిన్ తండ్రి పాత్ర. ముందుగా హీరోయిన్ గా త్రిషను అనుకున్నారట. కానీ, ఫ్రెష్ లుక్ కోసం ఆర్తీ అగర్వాల్ ని తీసుకున్నారు . ఇక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం నాజర్ , రఘువరన్ అనుకున్నా రవికిషోర్ ప్రకాష్ రాజ్ కావాలని పట్టుబట్టారట.

* ఇక అన్ని ఓకే అయ్యాక నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు. దీనికైన ఖర్చు అక్షరాల 60 లక్షలు. సినిమా మొత్తాన్ని చకచక 64 రోజుల్లో పూర్తి చేసారు

* సినిమా మొత్తం అయిపోయాక సినిమా రీ-రికార్డింగ్ మొదలు పెట్టారు. కోటి చేసిన రీ-రికార్డింగ్ మొదటగా రవికిషోర్ కి నచ్చలేదట. మళ్లీ రీ-రికార్డింగ్ కోసం శ్రమించారు కోటి. ఈ సారి వచ్చిన అవుట్ పుట్ కి బెస్ట్ రీ-రికార్డింగ్ ఇచ్చారంటూ రవికిశోర్ కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు.

* 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...' పాట కోసం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది.

* ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు నిడివితో 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటిగా సినిమా లెంగ్త్ ఎక్కువైపోయిందని అన్నారు . సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమని అన్నారు . కానీ రవికిశోర్ పట్టుదలతో సినిమాలోని ఒక్క బిట్టును కూడా కట్ చేయలేదు .

* బంతి క్యారెక్టర్ తో సునీల్ టాప్ కమెడియన్ అయిపోయాడు.

* 147 సెంటర్లలో 113 ప్రింట్లతో ఈ చిత్రం విడుదల చేస్తే సినిమాకి మొదటి ఆట నుంచే హిట్ టాక్.. వెంకీ కామెడీకి., త్రివిక్రమ్ పంచ్ లకి ఆడియన్స్ ఫిదా.. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు గా బిరుదు వచ్చింది.

* ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ తెలుగు చిత్రంగా నువ్వు నాకు నచ్చావ్ నిలిచింది.

* ఈ చిత్రం 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, మూడు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడింది.

* కన్నడలో గౌరామ్మ గా రీమేక్ చేశారు. అక్కడ ఉపేంద్ర, రమ్య నటించారు.. ఇక తమిళంలో వసీగరగా రీమేక్ చేయగా విజయ్, స్నేహ నటించారు. బెంగాలీలో రీమేక్ చేస్తే హిరాన్, శబంతి నటించారు.

* ఈ సినిమాకి మొత్తం ఆరు విభాగాల్లో నంది అవార్డులు లభించాయి.

* ఈ సినిమాని చూసిన నాగార్జున త్రివిక్రమ్, విజయభాస్కర్ లని పిలిచి మరి సినిమాని చేయమని ఆఫర్ చేశారు అదే "మన్మధుడు"

Show Full Article
Print Article
Next Story
More Stories