100 Crores: ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

100 Crores: ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
x

100 Crores: ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Highlights

Tollywood Suspence Thriller OTT: హ్యాపీ డేస్‌లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100...

Tollywood Suspence Thriller OTT: హ్యాపీ డేస్‌లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‍ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories