Ori Devuda Movie Review: ఓరి దేవుడా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Vishwak Sen Ori Devuda Movie Review
x

Ori Devuda Movie Review: ఓరి దేవుడా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Ori Devuda Movie Review: ఓరి దేవుడా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: ఓరి దేవుడా

నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, ఆషా భట్, మురళీ శర్మ, తదితరులు

సంగీతం: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న

నిర్మాతలు: పెర్ల్ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి

దర్శకత్వం: ఆశ్వంత్ మారిముత్తు

బ్యానర్లు: పీ వీ పీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

విడుదల తేది: 21/10/2022

ఈ మధ్యనే విడుదల అయిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు "ఓరి దేవుడో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మిథిలా పల్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈ సినిమా ఇవాళ అనగా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో చూసేద్దామా..

కథ:

అర్జున్ మరియు అను చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. వయసుతో పాటు వారి స్నేహం కూడా బలపడుతూ వస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అనుకి అర్జునుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అయినప్పటికీ అర్జున్ మాత్రం అనని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. పెళ్లయ్యాక అర్జున్ కు స్కూల్ లో తాను ప్రేమించిన ఫస్ట్ క్రష్ (అషా భట్) తారసపడుతుంది. దీని వల్ల అర్జున్ మరియు అను మధ్య గొడవలు మొదలవుతాయి. కొన్నేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ కి దేవుడు వెంకటేష్ ప్రత్యక్షమవుతాడు. జీవితాన్ని రెండోసారి ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తాడు. మరి ఈసారి అర్జున్ ఎవరిని ప్రేమిస్తాడు? చివరికి అర్జున్ మరియు అను విడిపోతారా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్ర కామెడీ టైమింగ్ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మంచి ఫన్ జనరేట్ చేస్తూ సినిమాని తన భుజాలతో మోసుకొని వెళ్ళాడు విశ్వక్. మిథిలా పాల్కర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. విశ్వక్ మరియు మిథిలా ల మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకి బాగానే వర్క్ అవుట్ అయ్యింది. దేవుడి పాత్రలో వెంకటేష్ చాలా బాగా సెట్ అయ్యారు. తెర పై వెంకీ ఉన్నంత సేపు సన్నివేశాలు చాలా బాగుంటాయి. రాహుల్ రామకృష్ణ నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. మురళి కృష్ణ, ఆషా భట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

తమిళ్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వంత్ మారిముత్తు తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. రీమేక్ అయినప్పటికీ చాలా వరకు కథ మరియు సన్నివేశాలను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తీశారు. డైరెక్టర్ సినిమా ను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చిన తీరుకు మెచ్చుకోవాలి. స్క్రీన్ ప్లే కూడా చాలా వినోదాత్మకంగా ఎక్కడా బోర్ కొట్టకుండా బాగానే నడిచింది. ఇంటర్వల్ సన్నివేశం మరియు క్లైమాక్స్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు ఈ సినిమాను మరింత పైకి తీసుకువెళ్లాయి. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి బాగా సెట్ అయ్యింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగానే ఎలివెట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సినిమాకి మంచి కలర్ ఫుల్ విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విశ్వక్ సేన్

వెంకటేష్

కామెడీ

బలహీనతలు:

కొన్ని బోరింగ్ సన్నివేశాలు

సెకండ్ హాఫ్

చివరి మాట:

సినిమా లో ఉండేవి కొన్ని పాత్రలే అయినప్పటికీ ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. సినిమా మొదటి హాఫ్ చాలా వరకు కామెడీ సన్నివేశాలతో సాగిపోతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ తో కథ కీలక మలుపు తిరుగుతుంది. తమిళ్ వెర్షన్ ను తెరకెక్కించిన డైరెక్టర్ రీమేక్ కూడా చేపట్టారు కాబట్టి కథలో సోల్ మాత్రం మిస్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి కానీ కొన్ని మంచి కామెడీ సన్నివేశాలు, విశ్వక్ సేన్ అద్భుతమైన నటన సినిమాని బోర్ కొట్టించకుండా చేశాయి. క్లైమాక్స్ లో లాగ్ అనిపించినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగానే ఉంది.

బాటమ్ లైన్: "ఓరి దేవుడా" అంటూ ప్రేక్షకులను బాగానే అలరించిన విశ్వక్ సేన్.

Show Full Article
Print Article
Next Story
More Stories