అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ.. ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్..

Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review
x

అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ.. ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్..

Highlights

అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ.. ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్..

చిత్రం: అశోకవనంలో అర్జున కళ్యాణం

నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్, రితిక నాయక్, గోపరాజు రమణ, నాగినీడు, తదితరులు

సంగీతం: జై క్రిష్

సినిమాటోగ్రఫీ: పవి కే పవన్

నిర్మాతలు: బాపినీడు బీ, సుధీర్ ఎదర

దర్శకత్వం: విద్య సాగర్ చింత

బ్యానర్లు: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

విడుదల తేది: 06/05/2022

ఈ మధ్యనే "హిట్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువహీరో విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" సినిమాతో పర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. "రాజావారు రాణి వారు", "ఫలక్నుమా దాస్" వంటి సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన విద్యాసాగర్ చింతా ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. "కృష్ణార్జున యుద్ధం" బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి విడుదల టీజర్ మరియు ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా ఈ చిత్రం ఇవాళ అనగా 2022న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో చూసేద్దామా..

కథ:

అర్జున్ (విశ్వక్ సేన్) 30 ఏళ్లు పైబడిన ఒక అబ్బాయి. అందరూ తనను పెళ్లెప్పుడు పెళ్ళెప్పుడు అని విసిగిస్తూ ఉంటారు. ఎట్టకేలకు మాధవి (రుక్సార్ ధిల్లాన్) తో అర్జున్ పెళ్లి అవుతుంది. సరిగ్గా అదే సమయంలో లాక్డౌన్ రావడంతో అర్జున్ మాధవి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ అర్జున్ తెలుసుకున్న విషయాలు ఏంటి? వారిద్దరి కుటుంబాలు కలిసాయా లేదా? చివరికి అర్జున్ కి మాధవి కి పెళ్లయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

పెళ్లి కోసం తాపత్రయ పడే ఒక 30 ఏళ్లు పైబడిన అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. సినిమాలో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ విశ్వక్ పాత్ర నుంచి వస్తుంది. అయినప్పటికీ విశ్వక్ సేన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. సినిమాని విశ్వక్ తన భుజాలపై మోసాడు అనడంలో అతిశయోక్తి లేదు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రుక్సార్ దిల్లాన్ ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఒకవైపు అందంతో మాత్రమే కాకుండా మరోవైపు నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. రితిక నాయక్ ముఖ్య పాత్రలో చాలా బాగా నటించింది. గోపరాజు రమణ మరియు నాగినీడు ఈ సినిమాలో చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఒక సాదాసీదా కథను తీసుకొని డైరెక్టర్ విద్య సాగర్ చింతా దానికి ఎంటర్టైన్మెంట్ జతచేసి సినిమాని బాగానే చిత్రీకరించారు. ట్రైలర్లో చూసినట్లు గానే సినిమాలో కామెడీ ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సీరియస్ సన్నివేశాలలో కూడా డైరెక్టర్ కామెడీ ను బాగానే పండించాడు. దాదాపు అన్ని పాత్రలను రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్దారు డైరెక్టర్. జై క్రిష్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం సినిమా కి బాగానే ప్లస్ అయింది. పవి కే పవన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. గ్రిప్పింగ్ గా ఉండే రైటింగ్ చాలా బాగా ప్లస్ అయింది.

బలాలు:

నటీనటులు

రైటింగ్

ఫీల్ గుడ్ కథ

ఎంటర్టైన్మెంట్

బలహీనతలు:

కథ బలంగా లేకపోవడం

నెరేషన్ అక్కడక్కడా స్లో అవ్వడం

లెంగ్త్ ఎక్కువ ఉండడం

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. కథ బలంగా లేకపోయినప్పటికీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కూడా కథ కొంచెం బలహీనంగా అలానే అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో సైడ్ క్యారెక్టర్ ల వల్ల వచ్చే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా తాగే సన్నివేశంలో కామెడీ చాలా బాగా జెనరేట్ అయింది. కథలో పెద్దగా ట్విస్ట్లు లేకపోయినప్పటికీ, కథ లైట్ హార్టెడ్ గా ఫీల్ గుడ్ డ్రామాగా అనిపిస్తుంది. చివరగా సినిమాలో కొన్ని బోరింగ్ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ అన్నిటినీ డామినేట్ చేస్తుంది.

బాటమ్ లైన్:

"అశోకవనంలో అర్జున కళ్యాణం" ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనింగ్ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories