Vikram Movie Review: విక్రమ్ సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Vikram Movie Telugu Review | Tollywood
x

Vikram Movie Review: విక్రమ్ సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Highlights

Vikram Movie Review: విక్రమ్ సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Vikram Movie Review:

చిత్రం: విక్రమ్

నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాధ్ ఫాసిల్, నరైన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, కాళిదాస్ జయరామ్, చెంబన్ వినోద్ దాస్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్

నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహీంద్రన్

దర్శకత్వం: లోకేష్ కనగరాజ్

బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

విడుదల తేది: 03/06/2022

"ఖైదీ", "మాస్టర్" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటించగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవ్వాళ అనగా జూన్ 3, 2022 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

చాలా డబ్బులు ఉన్న ఒక కొకైన్ కంటైనర్ కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత వరుసగా కొన్ని మర్డర్ లు జరుగుతాయి. పోలీస్ ఆఫీసర్ అమర్ (ఫాహాధ్ ఫాజిల్) ఈ కేస్ ను టేకప్ చేస్తారు. తన అండర్ కవర్ టీం తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. కర్నన్ (కమల్ హాసన్) మరియు మాస్క్ మ్యాన్ గురించి తెలుసుకుంటాడు. మరోవైపు విజయ్ సేతుపతి ఒక కరుడుగట్టిన డ్రగ్ స్మగ్లర్. ఆ డబ్బు ఉన్న కంటైనర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ ముగ్గురు ఎలా కలిశారు? అసలు కర్నన్ కు ఏం కావాలి? వీరి ముగ్గురి కథలు చివరికి ఏమవుతాయి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

కమల్ హాసన్ ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కమల్ హాసన్ తన ఎమోషన్ సన్నివేశాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను చాలా బాగా అలరించారు. తన పాత్రలో ఉన్న వేరియేషన్స్ ను కూడా కమల్ హాసన్ చాలా బాగా చూపించారు. విజయ్ సేతుపతి నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్సయింది. తన పాత్రకి విజయ్ సేతుపతి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఫాహాధ్ ఫాసిల్ కూడా తనదైన శైలిలో తన అద్భుతమైన నటన తో తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ఈ ముగ్గురు హీరోల నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. నరైన్ కూడా ఇన్స్పెక్టర్ పాత్రలో బాగానే నటించారు. అర్జున్ దాస్ మరియు హరీష్ కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ మళ్లీ ఈ సినిమాలో చూడొచ్చు. ఖైదీ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలను తెరకెక్కించారు లోకేష్. ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తనదైన స్టైల్ నెరేషన్ తో లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను తమ సీట్లకు కట్టిపడేస్తారు. కొన్ని చోట్ల కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ లోకేష్ తన నెరేషన్ తో కథను ముందుకు తీసుకు వెళ్లిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం కూడా చాలా బాగుంది. ముగ్గురు హీరోల కీ మూడు వేరే ట్యూన్స్ ని అందించిన అనిరుధ్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి.

బలాలు:

కమల్ హాసన్, ఫాహాధ్ ఫాసిల్, విజయ్ సేతుపతి

నెరేషన్

స్క్రీన్ ప్లే

యాక్షన్ సన్నివేశాలు

సంగీతం

బలహీనతలు:

కొన్ని స్లో సన్నివేశాలు

కథ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అనిరుధ్ సంగీతం, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, ముగ్గురు హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు, వారి నటన ప్రేక్షకులను సినిమా కి బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా సినిమా మొదలైన ఫస్ట్ గంట చాలా స్పీడ్ గా వెళ్లి పోతుంది. ఆ తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ ఇంటర్వెల్ సన్నివేశం ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. ఇంటర్వల్ బ్యాంగ్ ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ తో కథ కొంచెం ప్రెడిక్టబుల్ గా మారినప్పటికీ లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో కథను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఖైదీ సినిమా లోని కొన్ని లింక్స్ ను ఈ సినిమాలో కూడా చూపించారు లోకేష్. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. ఆఖరి ఐదు నిమిషాల్లో లోకేష్ కనగరాజ్ విక్రమ్ మరియు ఖైదీ సినిమాలకి ఇచ్చిన కనెక్షన్ ప్రేక్షకులకు మరింత హై ఇస్తుంది.

బాటమ్ లైన్:

"ఖైదీ" మార్క్ లోకేష్ కనగరాజ్ ని మరొకసారి ముందుకు తీసుకు వచ్చిన "విక్రమ్".

Show Full Article
Print Article
Next Story
More Stories