Viraaji Movie Review: ట్విస్టులతో కట్టిపడేసే “విరాజి”.. రివ్యూ ఎలా ఉందంటే?

Viraji: ట్విస్టులతో కట్టిపడేసే “విరాజి”.. రివ్యూ ఎలా ఉందంటే?
x

Viraji: ట్విస్టులతో కట్టిపడేసే “విరాజి”.. రివ్యూ ఎలా ఉందంటే?

Highlights

Viraji Movie Review: వరుణ్ సందేశ్ లీడ్‌ రోల్ పోషించిన “విరాజి” సినిమా నేడు విడుదలైంది.

Viraji Movie Review: వరుణ్ సందేశ్ లీడ్‌ రోల్ పోషించిన “విరాజి” సినిమా నేడు విడుదలైంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ సినిమాను నిర్మించారు. ఇటు టీజర్‌కు, అటు ట్రైలర్‌కు ఇప్పటికే భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో రిలీజైన విరాజి సినిమా ఎలా ఉందో రివ్యూ‌లో చూద్దాం.

కథ..

పలు కారణాలతో పదిమంది ఓ కొండమీదున్న పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు. వీరిలో సీఐ ప్రభాకర్ (బలగం జయరామ్), స్టాండ్ అప్ కమెడియన్ వేద(కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం (కాకినాడ నాని), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు(రవితేజ నన్నిమాల), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ(రఘు కారుమంచి), డాక్టర్ సుధా(ప్రమోదీని)తో ఉన్నారు. అయితే, వీరంతా మోసపోయి ఈ పాడుబడ్డ బంగ్లాలోకి వచ్చామని తెలుసుకుంటారు. వీరున్న పాడుబడ్డ బంగ్లా.. మూసివేసిన పిచ్చి ఆసుపత్రి అని తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇదే సమయంలో నిర్మాత కోదండరాంతోపాటు ఫొటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో మిగిలిన తొమ్మిదిమంది అన్ని ప్రయత్నాలు మాని పిచ్చి ఆసుపత్రిలోనే ఉండిపోతారు. అదే సమయంలో ఆండి (వరుణ్ సందేశ్) ఆ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటాడు. ఇక ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వీరంతా అసలు అక్కడి ఎలా వచ్చారు? అసలు చనిపోయిన సాగర్‌కు వీళ్లందరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే 'విరాజి' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ ఇష్యూస్‌ని తీసుకొని, ఆ సమస్యకు థ్రిల్లర్‌తోపాటు సస్పెన్స్ జోడించారు. చివరి వరకు ట్విస్టులు చెప్పకుండా స్టోరీని నడిపించాడు. పాడుబడ్డ బంగ్లాకు అసలు ఆ పదిమందిని ఎవరు పంపించారు? వారిని పంపించిన వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్‌ను క్లైమాక్స్ వరకు డైరెక్టర్ చక్కగా నడిపించాడు.

విశ్రాంతి వరకు సస్పెన్స్, థ్రిల్లర్‌లా సాగిన కథనం..ఆ తర్వాత వచ్చే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ ఎంతో బలమైంది. ఇక క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్‌ హైలెట్‌గా ఉంటాయి. నిడివి తక్కువ ఉండడం కూడా 'విరాజి'కు బాగా కలిసి వచ్చింది.

నటీనటులు..

వరుణ్ ఆండీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. విరాజి సినిమాతో వరుణ్ సందేశ్ సూపర్ హిట్ కొట్టాడు. బలగం జయరాం సిఐ మురళిగా ఆకట్టుకున్నాడు. రఘు కారుమంచి తెరపై సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా కనిపించేది కొద్దిసేపే అయినా.. కనిపించినంతసేపు నవ్విస్తాడు. ఇక మిగతా పాత్రలు కూడా తమ పరిధిలో న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం..

ఎబెనైజర్ పాల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి సరిగ్గా సరిపోయింది. బీజీఎంతో కొన్ని సీన్లకు ఊపిరి అందించాడు. విరాజిలో సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాత రాజీ పడకుండా తెరకెక్కించారు.

Rating: 2.75/5

Show Full Article
Print Article
Next Story
More Stories