సైరా రివ్యూ : చరిత్రలో నిలిచిపోయే సినిమా...

సైరా రివ్యూ : చరిత్రలో నిలిచిపోయే సినిమా...
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్,...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క ,తమన్నా లాంటి హేమహేమీలు సినిమాలో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు సినిమా ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. మరి సైరా గా చిరంజీవి ఎలా మెప్పించాడో మన సమీక్షలో చూద్దాం...

కధ :

రేనాడు అనే ప్రాంతాన్ని చిన్నచిన్న సంస్థనాలుగా చేసుకొని 61 మంది పాలేగాళ్ళు పాలిస్తూ వుంటారు. కానీ ఒకరికి ఒకరు పడదు.. ఇదే టైంలో రేనాడు అనే ప్రాంతపై ఆంగ్లేయులు పన్నులు విధిస్తూ ఉంటారు. దీనితో ఎవరికి కూడా స్వయం పాలన అన్నది లేకుండా పోతుంది. దీనికి తోడు ప్రజలు వర్షాలు పడక పంటలు పండక ఇబ్బంది పడుతుంటే ఆంగ్లేయులు పన్నులు కట్టాలని హింసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులు పై నరసింహ రెడ్డి అనే పాలేగాడు ఎలా పోరాటానికి దిగాడు అన్నది మిగిలిన కథ..

ఎలా ఉందంటే...

1857 సిపాయులు తిరుగుబాటు నుండి సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆంగ్లేయులు ఝాన్సీ లక్ష్మిభాయ్ పై దాడి చేస్తారు. అప్పుడు సైనుకుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఝాన్సీ లక్ష్మిభాయ్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథను వివరిస్తుంది.. ఆంగ్లేయుల పై స్వాతంత్రం కోసం పోరాటం చేసిన తొలి సమరయోధుడుగా సైరా నరసింహారెడ్డిని చాలా గ్రాండ్ గా చూపించాడు దర్శకుడు.. పంటలు పండకున్నా పన్ను కట్టాలని భారతీయులపై ఆంగ్లేయులు చేసిన అకృత్యాలను కళ్ళకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు.. 61 సంస్థనాలకు ఏకతాటిపైకి తేవడానికి నరసింహారెడ్డి చేసిన సన్నివేశాలతో పరమార్ధం సాగుతుంది. ఇక బ్రిటిష్ అధికారి అయిన జాక్సన్ తల నరికి ఆంగ్లేయులుకు పంపుతాడు నరసింహ రెడ్డి అక్కడినుండి సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది.

అందుకు తగ్గట్టుగానే రెండవ భాగం సాగుతుంది. ఆంగ్లేయులు పై నరసింహరెడ్డి చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. చిరంజీవి దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఎక్కువుగా కమర్షియల్ హంగులకు చోటు కల్పించి సినిమా గ్రాఫ్ ని ఎక్కడ కూడా తగ్గకుండా సన్నివేశాలను తీర్చిదిద్దాడు. ముఖ్యంగా యుద్ధం సన్నివేశాలు రోమాలు నిక్కబురిచే విధంగా చిత్రీకరించారు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తితో కూడి భాగోద్వేగంతో సాగడంతో సినిమాకి ప్రతి ఒక్కరిని సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు..

నటీనటులు:

సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటన ఓ అద్భుతమనే చెప్పాలి. చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఆయన పెట్టిన ఎఫర్ట్ కి ప్రతిఒక్కరు వావ్ అనాల్సిందే.. పాత్రలో ఆయన నటించారు అనడం కన్నా జీవించారనే చెప్పాలి. యుద్ధం సన్నివేశాల్లో ఆదరగొట్టారు. ఆంగ్లేయులు పై ఆయన చెప్పే డైలాగ్స్ మనచేతగా విజిల్స్ ని వెయిస్తాయి. ఇక నరసింహారెడ్డి రెడ్డి గా గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటన బాగుంది. విజయ సేతుపతి, జగపతిబాబు, తమన్నా , నయనతార, అనుష్క పాత్రలు సినిమాకి మెయిన్ అట్రాక్ట్ గా నిలిచాయి.. ఇక పవన్ కళ్యాణ్, నాగబాబు వాయిస్ ఓవర్ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ..

సాంకేతిక వర్గం :

సినిమాలో సాంకేతిక వర్గం గురించి ఎంత చెప్పిన తక్కువే అని చెప్పాలి. ఆనాటి పరిస్థితులను కళ్ళకి కట్టిన్నట్టు చూపించడంలో కెమెరామెన్ రత్నవేలు పనితనం బాగుంది. సంగీతం,నేపధ్య సంగీతం సినిమాని మరో మెట్టును ఎక్కించాయి. పరుచూరి కథ కథనాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక సురేందర్ రెడ్డి ని స్టైలిష్ డైరెక్టర్ అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు ఔరా అనిపిస్తాయి. ఇక రామ్ చరణ్ సినిమాని ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసాడు అనే దానికన్నా ఎంత ఇష్టంతో తీసాడో మనకి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది .

చివరగా ఓ మాట : సైరా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు చరిత్రలో నిలిచిపోయే సినిమా...

గమనిక : ఈ సమీక్ష కేవలం ఒక్క ప్రేక్షకుడు దృష్టిలో నుండి రాసింది మాత్రమే.. పూర్తి సినిమాని థియేటర్ కి వెళ్లి చూడగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories