Srikakulam Sherlock Holmes Review: క్రైమ్ సస్పెన్స్‌కు కామెడీ జోడించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'..

Srikakulam Sherlock Holmes Review: క్రైమ్ సస్పెన్స్‌కు కామెడీ జోడించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్..
x
Highlights

Srikakulam Sherlock Holmes Review: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఒక మంచి సినిమా, ఇది డిటెక్టివ్ నైపుణ్యాలను, భావోద్వేగ కథనాన్ని పునరుద్ధరించేలా దర్శకుడు తెరక్కించిన విధానం బాగుంది.

Srikakulam Sherlock Holmes Review: కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అడపాదడపా హీరోగా నటిస్తున్న నటుడు వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ (Srikakulam Sherlock Holmes)'. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlock Holmes) అనేది ఒక మంచి సినిమా, ఇది డిటెక్టివ్ నైపుణ్యాలను, భావోద్వేగ కథనాన్ని పునరుద్ధరించేలా దర్శకుడు తెరక్కించిన విధానం బాగుంది. ఈ సినిమా ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిస్టరీ, కుటుంబ కథనాలు, ప్రేమ కధలను సమర్థంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలో ఆశ్చర్యకరమైన ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతీ సీన్ ప్రేక్షకులను చివరివరకు థ్రిల్ కు గురిచేస్తుంది. కథ అనుకోని మలుపులు, శ్రద్ధతో నిర్మించబడిన పాత్రలు ఉంటాయి. దాన్ని చూసేవారు చివర్లో కూడా మిస్టరీని ఊహించలేరు.

వెన్నెల కిషోర్ (Vennela Kishore)డిటెక్టివ్ పాత్రలో తనదైన శైలిలో నటించారు. ఆయన పాత్రలోని తెలివితేటలు, భావోద్వేగాలు, ఈ రెండు గుణాలు కలిసి ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. హీరోయిన్ అనన్య నాగళ్ళ, రవి కూడా తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పాటలు ఫర్వాలేదని పించాయి. ఇక్కడ ప్రతి పాట కథను ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. దర్శకుడు రచయిత మోహన్ ఈ చిత్రాన్ని కేవలం డిటెక్టివ్ కథగా కాకుండా మానవ సంబంధాల లోతులను సమన్వయం చేయడంతో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చిత్రంలోని భావోద్వేగాలను బాగా కాప్చర్ చేస్తుంది.

ప్లస్ పాయింట్స్

* అద్భుతమైన ట్విస్టులు, డిటెక్టివ్ కథ

* హృదయాలను కట్టిపడేసే భావోద్వేగాలు

* నటీనటుల అద్భుతమైన ప్రదర్శన

* కథను ముందుకు తీసుకువెళ్లే పాటలు

మైసన్ పాయింట్స్

పాత కథను ఎంచుకోవడం

భావోద్వేగాల మధ్య మధ్యలో కామెడీ

చివరి తీర్పు:

ఒక ఆత్మీయమైన, భావోద్వేగాల కథను డిటెక్టివ్ కథతో సమన్వయంగా చూపించిన తీరు బాగుంది.

రేటింగ్ : 2.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories