Shaakuntalam: శాకుంత‌లం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Shaakuntalam Movie Review in Telugu
x

Shaakuntalam: శాకుంత‌లం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Shaakuntalam: శాకుంత‌లం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: శాకుంతలం

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్, గౌతమి, జిషు సేన్ గుప్తా, అల్లు అర్హ తదితరులు

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: శేఖర్ వీ జోసెఫ్

నిర్మాత: నీలిమ గుణ

దర్శకత్వం: గుణ శేఖర్

బ్యానర్లు: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

విడుదల తేది: 14/04/2023

2022 లో "యశోద" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "శాకుంతలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మైథాలజికల్ డ్రామా గా కాళిదాసు రాసిన "అభిజ్ఞాన శాకుంతలం" ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కి కూడా గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 2015లో "రుద్రమదేవి" సినిమా తర్వాత మళ్లీ 7 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. 2021 ఫిబ్రవరిలోనే పట్టాలెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా, సమంత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడి ఎట్టకేలకి ఇవాళ అనగా ఏప్రిల్ 14 2023 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో సమంత మరియు గుణశేఖర్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించారో చూసేద్దామా..

కథ:

ఇంద్రుడి ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుని తపస్సు బగ్నం చేసిన మేనక అతనితో ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. కానీ నరుడి వల్ల కలిగిన బిడ్డకు దేవలోకంలో ప్రవేశం లేనందున ఆ చిన్నారిని కణ్వ మహర్షి (సచిన్ కేడేకర్) ఆశ్రమంలో విడిచి పెడుతుంది. కణ్వ మహర్షి ఆ చిన్నారికి శకుంతల (సమంత) అని పేరు పెట్టి దత్తత తీసుకుంటారు. చాలా కాలం తర్వాత హస్తినాపురానికి రాజు దృశ్యంతుడు (దేవ్ మోహన్) కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అప్సరసలాంటి శకుంతలను చూసి ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడడంతో ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. శకుంతల గర్భవతి అయిన తర్వాత రాజ్యానికి వెళ్ళిపోయిన దృశ్యంతుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో శకుంతల దృశ్యంతుడి రాజ్యానికి వెళ్తుంది. కానీ దుష్యంతుడు అసలు ఆమె ఎవరో గుర్తు లేదని చెబుతాడు. శకుంతలను దుష్యంతుడు ఎందుకు మర్చిపోయాడు? దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని శకుంతల ఎలా పోగొట్టుకుంది? దుష్యంతుడి కి మళ్ళీ గతం గుర్తుకు వచ్చిందా? వీళ్ళిద్దరి ప్రేమ కథ సుఖాంతం అయిందా లేదా? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

మైథాలజికల్ సినిమాలలో పౌరాణిక పాత్రలు చేయడం అంత సులువైన విషయం కాదు. కానీ టైటిల్ రోల్ లో కూడా సమంత నటన బాగుంది. తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేయడం కోసం సమంత పడిన కష్టం వెండి తెర మీద కనిపించింది. సమంత స్క్రీన్ ప్రజెన్స్ సినిమాలో ఉన్న అతి కొద్ది ప్లస్ పాయింట్స్ లో ఒకటి. క్లోజప్ షాట్స్ లో కూడా సమంత చాలా బాగా నటించింది. దేవ్ మోహన్ బాగానే నటించాడు కానీ సమంతతో తన కెమిస్ట్రీ ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. చాలా వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి ప్రేమ కథ నడుస్తుంది కానీ ఈ ప్రేమ కథకి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేరు. మోహన్ బాబు తన పాత్రకి ప్రాణం పోసారని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కనిపించింది కాసేపే అయినప్పటికీ తన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ తో ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె కాన్ఫిడెంట్ నటన కి అందరూ ఫిదా అవుతారు. గౌతమి కూడా బాగానే నటించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ తరం ప్రేక్షకులకి మైథాలజికల్ కథలను చెప్పాలనుకున్న గుణశేఖర్ ఆలోచన చాలా మంచిది కానీ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా కథని నెరేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అభిజ్ఞాన శాకుంతలం ఒక అందమైన ప్రేమ కథ. కానీ అలాంటి ప్రేమ కథని వెండితెర మీదకి తీసుకురావటం రిస్క్ తో కూడుకున్న పని ఆ రిస్క్ ని తీసుకున్న గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయమే కానీ గుణశేఖర్ కథని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సినిమాలోని కీలక ఘట్టాలు కూడా ప్రేక్షకులకు ఘట్టాలకి కూడా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేదు పైగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. మణిశర్మ సంగీతం కేవలం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ బాగానే ఉన్నా చాలావరకు బోరింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా త్రీడీలో సినిమా ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఎడిటింగ్ కూడా ఏమాత్రం బాగోలేదు.

బలాలు:

గుణ శేఖర్ ప్రయత్నం

దుష్యంతుడి కోర్టు సీన్

కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు

అల్లు అర్హ నటన

బలహీనతలు:

కెమిస్ట్రీ లేకపోవడం

ఎమోషన్స్ అంత బాగా పండకపోవడం

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

సినిమా మొదటి హాఫ్ మొత్తం శకుంతల మరియు దుష్యంతుడి ప్రేమ కథ ను మాత్రమే చూపిస్తారు. కానీ సమంతా మరియు దేవ్ మోహంలో కెమిస్ట్రీ ఏమాత్రం బాగోలేదు. దేవ్ బదులు మరెవరైనా స్టార్ హీరోని పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మొదటి హాఫ్ పర్వాలేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ కథ పూర్తిగా ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో దుశ్యంతుడి సభా సన్నివేశం చాలా బాగా చిత్రీకరించారు. ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అల్లు అర్హ పాత్ర సినిమాకి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన నటన, డైలాగ్ డెలివరీ తో అల్లు అర్హ అందరినీ కట్టిపడేస్తుంది. త్రీడీలో చాలా లోపాలు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఎక్కువగానే ఉన్నప్పటికీ సినిమా ని ఆసక్తికరంగా చిత్రీకరించలేకపోయారు.

బాటమ్ లైన్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ "శాకుంతలం" సినిమా ఒక డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories