Ramarao On Duty Movie Review: "రామారావు ఆన్ డ్యూటీ" మూవీ రివ్యూ... ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

Ramarao On Duty Movie Review
x

Ramarao On Duty Movie Review: "రామారావు ఆన్ డ్యూటీ" మూవీ రివ్యూ... ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

Highlights

Ramarao On Duty Movie Review: "రామారావు ఆన్ డ్యూటీ" మూవీ రివ్యూ... ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

Ramarao On Duty Movie Review:

చిత్రం: రామారావు ఆన్ డ్యూటీ

నటీనటులు: రవి తేజ, దివ్యాన్ష కౌశిక్, రజిష విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, జాన్ విజయ్ తదితరులు

సంగీతం: సామ్ సీ ఎస్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: శరత్ మండవ

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

విడుదల తేది: 29/07/2022

వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. అయితే ఈ మధ్యనే విడుదలైన "ఖిలాడి" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన రవితేజ తాజాగా ఇప్పుడు "రామారావు ఆన్ డ్యూటీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా నటించింది. "క్రాక్" సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమా లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా జూలై 29, 2022 న థియేటర్ లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

సినిమా కథ మొత్తం 1995లో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రామారావు (రవితేజ) ఒక సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. ఎప్పుడూ నిజాయితీగా ఉండే రామారావు ఎర్రచందనం మాఫియా కేసును టేకప్ చేస్తారు. సీఐ జమ్మి మురళి (వేణు తొట్టెంపూడి) కూడా ఇన్వెస్టిగేషన్లో భాగమవుతారు. వీరిద్దరూ కలిసి ఆ ఎర్రచందనం మాఫియాని తుద ముట్టించారా లేదా అనేది సినిమా కథ.

నటీనటులు:

ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ చాలా బాగా నటించారు. అయితే తన పాత్రకు అనుగుణంగా రవితేజ ఎనర్జీ కొంచెం తగ్గినట్లు అనిపించినప్పటికీ రవితేజ పర్ఫామెన్స్ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దివ్యాన్ష కౌశిక్ మరియు రజిష విజయన్ కూడా చాలా బాగా నటించారు. తమ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తమ పరిధి మేరకు బాగానే నటించారు. వేణు తొట్టెంపూడి కూడా చాలా బాగా నటించారు. చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించిన వేణు తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నాజర్ మరియు నరేష్ లు కూడా తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేష్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

తన మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు శరత్ మండవ ఒక కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు కానీ దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవాలి. అసలు ఇంట్రడక్షన్ పవర్ఫుల్ గా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. కథ మొత్తం చాలా ఫ్లాట్ గా బోరింగ్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫామిలీ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యే విధంగా లేవు. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడంతో చాలా వరకు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టే విధంగా అనిపిస్తుంది. పాటలు అంత బాగా లేకపోయినప్పటికీ, నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని బోరింగ్ సన్నివేశాలు కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

బలాలు:

కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు

నేపథ్య సంగీతం

ప్రీ క్లైమాక్స్

బలహీనతలు:

స్క్రీన్ ప్లే

నెరేషన్

క్యారాక్టరైజేషన్

ఫస్ట్ హాఫ్

చివరి మాట:

సినిమా మొదలవడమే చాలా బోరింగ్ గా, స్లోగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే చాలా స్లోగా నడుస్తుంది. రవితేజ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో రవి తేజ పాత్ర చాలా సీరియస్ గా ఎంటర్టైన్మెంట్ కి దూరంగా అనిపిస్తూ ఉండడంతో అభిమానులు సైతం సినిమాకి కనెక్ట్ అవ్వలేరు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కొన్ని బాగానే వర్కౌట్ అయినప్పటికీ కొన్ని మాత్రం చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కూడా కేవలం యావరేజ్ గానే నిలిచింది. ఇక ప్రీ క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు పరవాలేదు అనిపిస్తాయి.

బాటమ్ లైన్:

"రామారావు ఆన్ డ్యూటీ" ఒక బోరింగ్ సగం ఉడికిన కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories