రాజుగారి గది 3 రివ్యూ...

రాజుగారి గది 3 రివ్యూ...
x
Highlights

సినిమా: రాజుగారి గ‌ది 3 న‌టీన‌టులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు త‌దిత‌రులు ద‌ర్శక‌త్వం: ఓంకార్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్రవ‌ర్తి ...

సినిమా: రాజుగారి గ‌ది 3

న‌టీన‌టులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు త‌దిత‌రులు

ద‌ర్శక‌త్వం: ఓంకార్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్రవ‌ర్తి

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు

ఎడిట‌ర్‌: గౌతంరాజు

డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల‌: 18-10-2019

తెలుగు సినిమాలకి సక్సెస్ ఫార్ములా హర్రర్ కామెడి.. సినిమాలో కొంచం కథ ఉండి కావలసినంత కామెడి ఉంటే సరిపోతుంది. సినిమాకి హిట్టు మెట్టు ఎక్కడం ఖాయం.. ఇదే ఫార్ములాతో యాంకర్, దర్శకుడు ఓంకార్ రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇదే తరహాలోనే ఈరోజు రాజుగారి గది 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..

కథ :

మాయ ( అవికా గొర్ ) ఓ డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమెను తాకాలని చూసిన వారు మరణిస్తారు. ఆమెకి కాపలాగా ఓ ఆత్మ కవచం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఓ కాలనీలో అశ్విన్( అశ్విన్ బాబు) అనే ఆటో డ్రైవర్ ఉంటాడు. అతను కాలనీ వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వడు.. దీనితో ఆ కాలనీలోని కొంత మంది వ్యక్తులు అశ్విన్ ని మాయ ప్రేమలో పడేలా చేస్తారు. అలా చేస్తే మాయ వెనుక ఉన్న ఆత్మ అశ్విన్ ని చంపేస్తున్నది వారి ప్లాన్ ... మరి అశ్విన్ మాయ ప్రేమలో పడ్డాడా ? ఇంతకి మాయ చుట్టూ ఉన్న ఆ ఆత్మ ఎవరు ? చివరికి ఏమైంది అన్నది అసలు కథ..

ఎలా ఉందంటే...

రాజుగారు గది సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు అయింది. ఇప్పుడు ఇదే సినిమాకి సీక్వెల్స్ అన్నప్పుడు ప్రేక్షకుడి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పలనా సన్నివేశం, పలనా కామెడి సీన్ ఉంటుందేమో అని లెక్కలు వేసుకొని ధియేటర్ లోకి వస్తాడు. అవి లేనప్పుడు సినిమా పైన ఆసక్తి తగ్గిపోతుంది. ఇదే విషయం రాజుగారి గది 2 కి జరిగింది. ఆ సినిమాలో ఆశించిన కామెడి లేకపోవడంతో సినిమా ఆడలేదు. ఇదే విషయాన్నీ దర్శకుడు ఓంకార్ కూడా ఒప్పుకున్నాడు. అందులో ఉన్న మైనస్ లని ప్లస్ గా చేసేందుకు రాజుగారి గది 3 కోసం బాగానే కష్టపడ్డాడు. భయపెట్టాల్సినంతగా భయపెట్టారు, నవ్వించే దగ్గర నవ్వించాడు.

కానీ కథ పెద్దగా లేకపోవడంతో సినిమాలో సాగదీత ఎక్కువగా కనిపించింది. మొదటి భాగం మొత్తం ఇదే కోవలో నడుస్తుంది. ఇక సినిమా హైదరాబాదు నుండి కేరళకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో అప్పుడు పుంజుకుంటుంది. గ‌రుడ‌పిళ్లైగా అజ‌య్ ఘోష్‌, జ‌గ‌న్మాత‌గా ఊర్వశి చేసే సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. అంద‌రినీ భ‌య‌పెట్టే వాళ్లకి, రాజ‌మ‌హ‌ల్‌లో ఎదుర‌య్యే అనుభ‌వాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి... ఇక అవికా చుట్టూ కాపలా ఉన్న ఆత్మ ఎవరిదీ అన్న సన్నివేశాలు బాగుంటాయి. సినిమాలో కావలసినంత కామెడి ఉండడం సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పవచ్చు..

నటినటులు ;

సినిమాకి సినిమాకి తనని తనని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అశ్విన్.. ఈ సినిమాలో అతని నటన,డాన్స్ లో పరిణితి కనిపించింది. అలీ కామెడి సూపర్బ్ గా వర్కౌట్ అయింది. అవికా గొర్ కి మంచి పాత్ర దక్కింది. అజ‌య్‌ఘోష్‌, ఊర్వశి ,ధ‌న్‌రాజ్‌, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, హ‌రితేజ, శివ‌శంక‌ర్ మాస్టర్ పాత్రల ప‌రిధి మేర‌కు రాణించారు.

సాంకేతిక వర్గం:

రాజు గారి గదిని అద్భుతంగా చూపించడంలో కెమరామెన్ ఛోటా కె.నాయుడు చాలా సక్సెస్ అయ్యాడు. తన అనుభవాన్ని మొత్తం సినిమాలో చూపించాడు. చోటా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయి. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిని పెంచాయి. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయిన నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తానికి ఓంకార్ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ పై మంచి పట్టు అయితే సాధించాడనే చెప్పాలి. టులో చేసిన తప్పులని ఐడెంటిటీ చేసి త్రీలో మిస్ కాకుండా చేసి పర్వాలేదు అనిపించాడు..

చివరగా ఓ మాట ; రాజుగారి గది 3 : భయపెట్టకున్నా బాగా నవ్విస్తుంది.

గమనిక ; సినిమా ఒక్క ప్రేక్షకుడి ద్రుష్టిలో నుండి రాసినది. పూర్తి సినిమా కోసం ధియేటర్ కి వెళ్లి చూడగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories