Purushothamudu Movie Review: పురుషోత్తముడు మెప్పించాడా.? రాజ్‌తరుణ్‌ హిట్టు కొట్టినట్లేనా..

Purushothamudu Movie Review: పురుషోత్తముడు మెప్పించాడా.? రాజ్‌తరుణ్‌ హిట్టు కొట్టినట్లేనా..
x

Purushothamudu Movie Review: పురుషోత్తముడు మెప్పించాడా.? రాజ్‌తరుణ్‌ హిట్టు కొట్టినట్లేనా..

Highlights

రాజతరుణ్‌ నటించిన కొత్త చిత్రం పురుషోత్తముడు విడుదలైంది. గత కొన్ని రోజులుగా సరైన విజయం లేక ఇబ్బందిపడుతోన్న ఈ యంగ్‌ హీరోకి పురుషోత్తముడు ఏమేర ఊరట కల్పించిందో తెలియాలంటే సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సినిమా పేరు: పురుషోత్తముడు

నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు

సంగీతం: గోపీ సుందర్‌

సినిమాటోగ్రఫీ: పీజీ విందా

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌

రచన, దర్శకత్వం: రామ్‌ భీమన

గతకొన్నిరోజులుగా రాజ్‌తరుణ్‌ పేరు మారిమోగుతోన్న విషయం తెలిసిందే. అయితే సినిమా విషయంలో కూడా వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించి రాజ్‌తరుణ్‌ ఇటీవల టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాడు. అయితే ఇలాంటి తరుణంలోనే రాజతరుణ్‌ నటించిన కొత్త చిత్రం పురుషోత్తముడు విడుదలైంది. గత కొన్ని రోజులుగా సరైన విజయం లేక ఇబ్బందిపడుతోన్న ఈ యంగ్‌ హీరోకి పురుషోత్తముడు ఏమేర ఊరట కల్పించిందో తెలియాలంటే సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే..

అసలు సినిమా కథేంటి.?

రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) బాగా ధనవంతుడు. గోల్డెన్‌ స్పూన్‌తో జన్మిస్తాడు. దేశంలోనే గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ)కి తనయుడు. లండన్‌లో విద్యనభ్యసించి దేశానికి తిరిగి రాగానే, పీఆర్‌ గ్రూప్స్‌ కొత్త సీఈవోగా నియమించాలని ఆదిత్య రామ్‌ డిసైడ్‌ అవుతాడు. అయితే అందుకు రచిత్‌ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈఓ అయ్యే వ్యక్తి 100 రోజుల పాటు ఓ సామాన్యుడిలా జీవించాలని కండిషన్‌ పెడుతుంది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన హీరో ఓ పల్లెటూరికి చేరుకుంటాడు. ఈ క్రమంలోనే రచిత్ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.? ఈ సమయంలో అమ్ము (హాసినీ సుధీర్‌)కు మధ్య ప్రేమ ఎలా పుడుతుంది.? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

కోటీశ్వరుడైన వ్యక్తి అన్నీ వదిలేసి సామాన్యుడిగా జీవించాలనే కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగులో వచ్చాయి. అచ్చంగా పురుషోత్తముడు కూడా కథ కూడా అలాగే సాగుతుంది. అయితే కథలో కొత్తదనం లేకపోయినా రాజ్‌ తరుణ్‌ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కామెడీ సీన్స్‌ రాజ్‌తరుణ్‌ ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో ప్రేక్షకులు ఎగ్జైట్‌మెంట్‌ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే మంచి క్లీన్‌ మూవీని ఎంజాయ్‌ చేసే వారిని మాత్రం పురుషోత్తముడు ఆకట్టుకుంటాడనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories