'ఒరేయ్ బుజ్జిగా' రివ్యూ.. రొటీన్ కామెడీనే!

ఒరేయ్ బుజ్జిగా రివ్యూ.. రొటీన్ కామెడీనే!
x

 Orey Bujjiga 

Highlights

Orey Bujjiga Movie Review : కరోనా వలన ధియేటర్లు మూతపడడంతో సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పటినుంచో ల్యాబ్‌లలో ఉండిపోయిన ‘ఒరేయ్ బుజ్జిగా...’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Orey Bujjiga Movie Review : కరోనా వలన ధియేటర్లు మూతపడడంతో సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పటినుంచో ల్యాబ్‌లలో ఉండిపోయిన 'ఒరేయ్ బుజ్జిగా...' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా'లో ఈ చిత్రం విడుదలైంది..రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పైన ముందునుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి.. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుందో మన రివ్యూలో చూద్దాం!

కథ విషయానికి వచ్చేసరికి భీమవరంకి చెందిన బుజ్జిగాడు (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి ఇష్టం లేకా పారిపోతారు.. అయితే ఒకరికి ఒకరు తెలియదు.. ఇద్దరు ఒకేరోజు వెళ్ళిపోవడంతో ఇద్దరూ కలిసి లేచిపోయారన్న రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఆ ఊళ్లో ఉన్న వీళ్ల కుటుంబాలు రెండు బద్ద శత్రువులుగా మరుతాయి. ఆ తరవాత బుజ్జిగాడు, కృష్ణవేణి శ్రీను, స్వాతి పేర్లతో ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, మధ్యలోకి హెబా పటేల్ ఎందుకు వచ్చింది అన్నది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే?

రొటీన్ స్టొరీని చాలా ఫుల్ కామెడీతో నడిపించాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా.. సినిమా మొత్తంలో గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలు ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి.. సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా డీసెంట్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని చాలా లాగ్ చేశాడని చెప్పాలి.. కొన్ని సన్నివేశాలను అనవసరం అన్న ఫీలింగ్ వస్తుంది. బుజ్జిగాడు, కృష్ణవేణి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.. ఇక సెకండ్ హాఫ్ లో నరేష్ సప్తగిరి మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇద్దరు పోటి మరి నటించారు. ఇక సినిమా క్లైమాక్స్ రొటీన్ గానే ఉంది. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్‌తో బలమైన ఫైట్లు చేయించారు దర్శకుడు.

ఎవరెవరు ఎలా చేశారంటే?

బుజ్జిగాడు లాంటి పాత్రలను ఇప్పటికే రాజ్ తరుణ్ చేసి ఉండడంతో చాలా ఈజ్‌తో నటించాడు. నిజానికి ఆ పాత్రలో మరో హీరోను కూడా ఉహించుకోలేము కూడా.. రాజ్ తరుణ్ కి తోడుగా సప్తగిరి, మధు నందన్, సత్య లాంటి కమెడియన్లు తోడవ్వడంతో సినిమాలో కామెడీ సీన్స్ బాగా పేలాయి.. మాళవిక నాయర్ తన పాత్రకి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక కొద్దిసేపే ఉన్న హేబ్బా పటేల్ కూడా బాగా ఆకట్టుకుంది. వాణీ విశ్వనాథ్, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, సత్యం రాజేష్ వారివారి పాత్రలకి న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ విషయానికి వచ్చేసరికి ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. లోకేషన్స్ ను చాలా అందంగా చూపించాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. మెలోడీలు ఆకట్టుకుంటాయి. ఇక ఎడిటర్ ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్తే బాగుండేది.. ఇక దర్శకుడు రొటీన్ కథనే తీసుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మార్చడంలో విఫలం అయ్యాడు.. మొత్తానికి సినిమాకి ఓ సారి చూసి నవ్వేసుకోవచ్చు!

Show Full Article
Print Article
Next Story
More Stories