'యన్‌టిఆర్‌ మహానాయకుడు' మూవీ రివ్యూ

యన్‌టిఆర్‌ మహానాయకుడు మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: ఎన్టీఆర్‌ మహనాయకుడు నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, రానా దగ్గుబాటి, మంజిమా మోహన్‌, సచిన్ ఖేడేకర్,...

చిత్రం: ఎన్టీఆర్‌ మహనాయకుడు

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, రానా దగ్గుబాటి, మంజిమా మోహన్‌, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్ తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌

ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ

మాటలు: బుర్రా సాయిమాధవ్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇండూరి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

విడుదల తేదీ: 22/02/2019

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన భాగంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పైన కూడా పడిందని చెప్పుకోవాలి. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా పూర్తిగా నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం గురించి చూపిస్తుందని అందరికీ తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించిన ఈ సినిమా ఇవాళ అనగా ఫిబ్రవరి 22 న విడుదలైంది. బాలయ్య స్వయంగా ఈ సినిమాను కూడా నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ఎన్టీఆర్‌ బాల్యం, బసవ తారకంతో ఎన్టీఆర్ వివాహం మొదటి భాగంలో చూడని విషయాలే. ఇప్పుడు వాటిని 'ఎన్టీఆర్ మహనాయకుడు' సినిమా తో మన ముందుకు తీసుకువచ్చారు. తెలుగు దేశం పార్టీ సంస్థాపణతో మొదటి భాగం ముగుస్తుంది. ఇప్పుడు అక్కడినుండే రెండవ భాగం మొదలవుతుంది. తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందించడం తో మొదలైన రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రచారం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, నాదెండ్ల భాస్కర్‌ రావు వెన్నుపోటు, ఎన్టీఆర్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవడం, తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇలా సాగిన సినిమాకి చివరగా బసవ తారకం మృతి తో సినిమాకు ముగింపు పలికారు.

నటీనటులు:

తొలిభాగంలోనే యువ ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి కానీ ఈ సారి మొత్తం రాజకీయ నేపథ్యంలో సాగగా, బాలయ్య వయసుకు తగ్గ పాత్రే చేయడంతో బాగానే అనిపిస్తుంది. హావభావాలు కానీ, డైలాగు డెలివరీ కానీ, లుక్స్ పరంగా కానీ నిజంగా అన్నగారేనా అన్నట్టు అనిపించింది.

అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతం. ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌ ది. నిజంగా బసవతారకం పాత్రలో ఆమె ఒడిగిపోయారు అని చెప్పచ్చు. బాలయ్య తో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఈమె నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక సినిమాలో హైలైట్ చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా. చంద్రబాబు ని రానా కంటే గొప్పగా ఇంకెవ్వరు తెరపై ఆవిష్కరించలేరేమో అన్నంత బాగా నటించాడు. నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్‌ కేద్కర్‌ బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో కొన్ని పొరపాట్లు మళ్లీ చేయకూడదని బాగానే ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ కథ అసంపూర్ణంగా ఉండటంతో క్రిష్ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం తెరపై ఆవిష్కరించడంలో మాత్రం బాగానే సక్సెస్ అయ్యాడు. మొదటి హాఫ్ లో అతని నెరేషన్ బాగానే అనిపించినప్పటికీ రెండవ హాఫ్ లో కథ బాగా స్లో అయిపోయింది. కీరవాణి సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు బాగా ఎలివేట్‌ అయ్యాయి. సాయి మాధమ్‌ బుర్రా మాటలు చాలా బాగా రచించారు. అర్రం రామకృష్ణ ఎడిటింగ్‌ పర్వాలేదు అనిపించింది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది. ఎన్బీకే నిర్మాణ విలువలు చాలా బాగానే కుదిరాయి.

బలాలు:

నటీనటులు

కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

సంగీతం

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు

కథ మొత్తం చూపించకపోవడం

చివరి మాట:

బయోపిక్‌ ముసుగులో బాలయ్య కేవలం ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని అంశాలను మాత్రమే చూపించారు. నాదెండ్లను విలన్‌గా చూపెట్టి 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో బాబుది కీలకపాత్ర చేశారు. ఎన్టీఆర్‌ను, టీడీపీని రక్షించిన చంద్రబాబే అసలు హీరో అన్నట్లు అనిపించింది. ఇక ఎన్టీఆర్, బసవతారకం మధ్య కొన్ని ఎమోషనల్ సీన్లు, డైలాగులు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి.

బాటమ్ లైన్:

'ఎన్టీఆర్ మహనాయకుడు' అసంపూర్ణ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories