Rangde Review:'రంగ్‌దే' మూవీ రివ్యూ

Nithins RangDe Movie Review
x
నితిన్, కీర్తి సురేష‌ (ఫొటో ట్విట్టర్)
Highlights

Rangde Review: గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న నితిన్‌.. ఈ ఏడాది చెక్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు.

Rangde Review: గతేడాది 'భీష‍్మ'తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది చెక్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'చెక్‌' మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఈ సారి రంగ్ దే సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో‌. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఆ అంచనాలను 'రంగ్‌దే' టీమ్‌ అందుకుందా? వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్, మహానటి కీర్తి సురేష్ కాంబో తెరపై ఎలా ఉంది? ఎన్నో ఆశలతో నేడు విడుదలైన రంగ్ దే మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం..

కథ

అర్జున్ (నితిన్), అనుపమ అలియాస్ అను (కీర్తి సురేష్) చిన్ననాటి స్నేహితులు, పొరుగింట్లోనే ఉంటారు. కానీ, వీరిద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లా గొడవలు పడుతూ ఉంటారు. అను మెరిట్ స్టూడెంట్. అర్జున్ యావరేజ్ స్టూడెంట్. కాగా, అను మార్కులతో అర్జున్ ను పోల్చుతూ.. తక్కువచేసి మాట్లాడుతుంటాడు అర్జున్ తండ్రి (నరేష్). దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. అర్జున్ ఎంబీఏ చేసేందుకు జీమాట్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అను సహాయం లేకుండా విజయం సాధించాలని అనుకుంటాడు. కట్ చేస్తే.. అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్‌ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. మరి ఎప్పుడూ గొడవపడే వీరు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? దానికి కారణం ఏంటి? పెళ్లి తరువాత వీరి కాపురం ఎలా సాగింది? పెళ్లి తరువాత అను చెప్పే ఆ ట్విస్ట్ ఏంటి? ఆతరువాత ఏమైంది లాంటి విషయాలు సినిమాలో చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రంలో నితిన్ చాలా క్యూట్ గా కనిపిస్తాడు. తాను ఏ పాత్రనైనా ఈజీగా చేయగలనని మరోసారి నిరూపించుకున్నాడు. అల్లరిగా తిరిగే అర్జున్‌ పాత్రలో నితిన్‌ అద్భుతంగా నటించాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలో నటనతో మెప్పించాడు. నచ్చని భార్యతో కాపురం ఎలా ఉంటుందో అర్జున్‌ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కిర్తి సురేష్‌ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్‌ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. నితిన్, కీర్తి సురేష్ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. వీరి మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంటుంది.

పొరుగింట్లో ఉండే కుటుంబాల క‌థ ఇది. పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన ఓర్చుకొని తల్లిదండ్రులు కోకొల్లలు. దీని వల్ల వారి మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడడం సహజం. 'రంగ్‌ దే' సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్యవహారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్పడతాయనేదే 'రంగ్‌దే' స్టోరీ.

దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కథలో కొత్తదనం లేదు. కానీ తెరపై చూపించిన విధానం ఆకట్టకుంటుంది. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నితిన్, కీర్తి సురేష్ ల మధ్య ఈగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి కట్టిపడేస్తాయి. అను, అర్జున్‌ మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, స్లో నెరెషన్‌ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది.

ఇంటర్వెల్‌లో అను ఇచ్చిన ట్విస్ట్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ లో సినిమా కాస్త బోరింగ్ గా ఉంటుంది. సాగదీత సీన్లతో కొంచెం విసిగిస్తాడు. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ అతికేలా ఉండవు. కథంతా రోటీన్‌గా సాగుతుంది.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా అందించాడు. ఎడిటర్‌ నవీన్‌ నూలి కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను క్రిస్ప్‌గా చేస్తే బాగుండేది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్‌ దే స్టోరీ రొటీనే.. కానీ, అర్జున్‌, అనుల టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ఆకట్టుకుంటుంది.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!

Show Full Article
Print Article
Next Story
More Stories