Movie Review: కృష్ణ అండ్ హిస్ లీల.. మెల్లగా సాగే ముక్కోణపు గాథ!

Movie Review: కృష్ణ అండ్ హిస్ లీల.. మెల్లగా సాగే ముక్కోణపు గాథ!
x
Highlights

Movie review: ఒటీటీ లో మరో సినిమా విడుదలైంది. కృష్ణ అండ్ హిస్ లీలా పేరుతొ దగ్గుబాటి రానా నిర్మించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. సినిమా ఎలావుందో మీరూ ఓ లుక్కేయండి.

ఒటీటీ లో మరో సినిమా విడుదలైంది. మెల్ల మెల్లగా చిన్న సినిమాలు ఒటీటీకి దారి వెతుక్కుంటున్నాయి. ఇదే దారిలో ఈరోజు (జూన్ 25) కృష్ణ అండ్ హిస్ లీల విడుదల అయింది. ఈ సినిమాని దగ్గుబాటి రానా నిర్మించారు.

కథ ఇలా..

ఇది ఓ ముక్కోణపు ప్రేమ కథ. ఒకమ్మాయితో ప్రేమలో మునిగిన యువకుడు కొన్ని కారణాలతో ఆమెతో విడిపోతాడు. తరువాత మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన అతనికి మాజీ ప్రియురాలు కలుస్తుంది. అక్కడ ఆమె మళ్ళీ ఇతనికి దగ్గరవుతుంది. దీంతో అక్కడ ఆమె.. ఇక్కడ ఈమె అన్నట్టుగా ఇద్దరితోనూ ప్రేమాయణం సాగిస్తాడు. చివరికి ఈ ప్రేమాయణం ఎలా ముగిసింది. అనేది సినిమా కథ.

ఎవరెలా చేశారు..

ఇద్దరమ్మాయిల ప్రేమలో పడ్డ యువకుడు కృష్ణ గా సిద్ధూ జొన్నలగడ్డ చేశారు. ఇక అతను మొదట ప్రేమించిన అమ్మాయి సత్యగా శ్రద్ధా శ్రీనివాస్.. రెండో ప్రేమికురాలు రాదగా శాలిని నటించారు. ప్రేమ.. ప్రియురాళ్ళ విషయంలో క్లారిటీ లేని కృష్ణుడిగా సిద్ధూ మంచి ఈజ్ తో నటించాడు. ఇక అతనితో బ్రేకప్ అయి మళ్ళీ అతనికి దగ్గరయిన సత్యగా శ్రద్ధా శ్రీనివాస్పాత్రలో ఒదిగిపోయింది. ఇక కొత్త గా వచ్చిన షాలిని చక్కని నటన ప్రదర్శించింది. ముగ్గురి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సిద్ధూ ఇద్దరు హీరోయిన్ల మధ్యలో ప్రేమ సీన్లలోనూ వారితో వచ్చే కన్ఫ్యూజన్ సేన్లలోను మెప్పించారు. ఇక హర్ష కమేడియన్గా మంచి పాత్రలో కనిపించి మేరిశారు.

తెరవెనుక పనితనం ఎలా ఉందంటే..

దగ్గుబాటి రానా నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ ఉండడంతో ఎక్కడా నిర్మాణం విషయంలో రాజీపడలేదు.. ఇక ఈ సినిమాకి సంగీతం ముఖ్యంగా నేపధ్య సంగీతం అడిరిపోయిందనే చెప్పాలి. శ్రీ చరణ్ పాకాల తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో డైలాగులు చాలా బావున్నాయి. దర్శకుడుగా రవికాంత్ ఫర్వాలేదనిపించారు. తను అనుకున్న విధంగా కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కాకపోతే సినిమా చాలా మెల్లగా సాగినట్టు అనిపిస్తుంది.

మొత్తమ్మీద కృష్ణ.. సత్య-రాధల ప్రేమాయణం ఆకట్టుకునేలానే ఉంటుంది. ప్రేమకథలు ఇష్టపదేవారికి.. ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.

గమనిక: ఈ సమీక్ష రచయిత స్వంత అభిప్రాయం మాత్రమె.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories