రాక్షసుడు రివ్యూ ..

రాక్షసుడు రివ్యూ ..
x
Highlights

సరైనా హిట్టు కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెగ ట్రై చేస్తున్నాడు . బడాబడ నిర్మాతలు , గొప్ప హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి...

సరైనా హిట్టు కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెగ ట్రై చేస్తున్నాడు . బడాబడ నిర్మాతలు , గొప్ప హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సరైనా హిట్టు ఇవ్వలేకపోయారు . తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చినా సీత సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది . ఈ సారి యాక్షన్ కథలు పక్కన పెట్టి ఈ సారి ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చాడు .

కథ : -

అరుణ్ ( హీరో ) ఎస్సై ఉద్యోగం చేస్తూ ఉంటాడు . అతడు ఉద్యోగంలో చేరాకా ఓ పదహారేళ్ళ అమ్మాయి హత్య చేయబడుతుంది. అప్పటికే నేర పరిశోధనలపై అవగాహన ఉన్నా అరుణ్ ఇది ఒక సైకో చేసిన హత్యగా గుర్తిస్తాడు .కానీ పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మదు. వరుసగా ఇలాంటి హత్యేలే జరుగుతూ ఉండడంతో పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మి అతనికి ఈ కేసును అప్పజేప్పుతుంది . ఈ క్రమంలో హీరో అరుణ్ అ కేసును ఎలా సాధించాడు అన్నది మిగిలిన కథ ..

ఎలా ఉంది అంటే :

రాక్షసుడు చెప్పుకోడానికి పెద్ద కథ అయితే ఏమి కాదు కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపించాడని చెప్పలి . మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుడికి తర్వాత ఎం జరుగుతుందన్న ఆసక్తిని చివరి వరకు నిలిపాడు . కొన్ని సన్నివేశాల్లోని ట్విస్ట్ లు మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి . మొదటి బాగంతో పోలిస్తే రెండవ భాగం కొంచం నెమ్మదించిందని చెప్పాలి .. ఇక క్లైమాక్స్ కూడా ఉహించిన రీతిలో లేకపోవడంతో సినిమాకి మరో మైనస్ గా చెప్పాలి .

నటినటులు :

తన గత చిత్రాల కంటే ఈ సినిమాలో మంచి నటనని కనబరిచాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. ఇక అనుపమ పరమేశ్వరన్ ఉన్నంతలో బాగా అకట్టుకుంది . విలన్ గా శరవణన్ అదరగొట్టాడు .మీగాతా నటినటులు పాత్రల మేరకు ఆకట్టుకున్నారు..

సాంకేతిక నిపుణులు :

సినిమాలో కెమరమన్ వర్క్ బాగుంది . ఇక గిబ్రాన్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది . ఎడిటర్ రెండవ భాగంపై మరింత ఫోకస్ చేస్తే బాగుండు అనిపిస్తుంది . ఇక రమేష్ వర్మ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది ..

చివరగా ఓ మాట :

సస్పెన్స్ మరియు థ్రిల్లర్ కాన్సెప్ట్ లను ఎక్కువగా ఇష్టపడే వారికీ సినిమా బాగా నచ్చుతుంది . మిగతావారికి సినిమా సో సో గా అనిపించవచ్చు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories