Karthikeya 2: 'కార్తికేయ 2' మూవీ రివ్యూ.. ప్రేక్షకులను కట్టిపడేసే..

Karthikeya2 Movie Review
x

Karthikeya 2 Movie Review: కార్తీకేయ 2 మూవీ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే ?

Highlights

Karthikeya 2 Movie Review: కార్తీకేయ 2 మూవీ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే ?

Karthikeya 2 Movie Review:

చిత్రం: కార్తికేయ 2

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, హర్ష చెముడు, ఆదిత్య మీనన్, ప్రవీణ్, సత్య, తులసి తదితరులు

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీ జీ విశ్వ ప్రసాద్

దర్శకత్వం: చందూ మొండేటి

బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

విడుదల తేది: 13/08/2022

ఎప్పుడో కరోనాకి ముందు 2019లో "అర్జున్ సురవరం" సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చాలా కాలం తరువాత ఎట్టకేలకు "కార్తికేయ 2" సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. "కార్తికేయ" కథతో ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు చిత్ర డైరెక్టర్ చందు మొండేటి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా ఆగస్టు 13, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చే నిఖిల్ ఈసారి కూడా అలాంటి సినిమాతోనే మన ముందుకి వచ్చారు. "కార్తికేయ 2" ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కథ. ఇక సినిమా మొదలవటమే ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. సినిమా కథ మొత్తం శ్రీకృష్ణుడి కి చెందిన ఒక నగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది? అది ఇప్పుడు ఎక్కడుంది? దానిని ఎవరు చేజిక్కించుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్) దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

క్యారెక్టర్లకి కాకుండా కథకి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. చాలావరకు కథ హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిఖిల్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. టిపికల్ హీరో పాత్ర కాకుండా నిఖిల్ కి ఈ సినిమాలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. ఇక నిఖిల్ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు. సినిమాలో కార్తికేయ పాత్రని పక్కన పెడితే మిగతా పాత్రలకి అంత ప్రాధాన్యత మరియు స్క్రీన్ టైం లేవు. అయినప్పటికీ వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో బాగానే మెప్పించింది. అనుపమ్ ఖేర్ నటన సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. శ్రీనివాస రెడ్డికి కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. హర్ష, ఆదిత్య మీనన్, ప్రవీణ్, సత్య వంటి నటులు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ చందు మొండేటి సినిమా కథని చాలా బాగా నెరేట్ చేశారు. రొటీన్ కథలకి భిన్నంగా ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ చందు మొండేటి దానిని వెండితెరపై ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా బాగా మెప్పించారు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా చందు మొండేటి మంచి మార్కులు వేయించుకున్నారని చెప్పుకోవాలి. ఇక "కార్తికేయ" సినిమాతో పోలిస్తే "కార్తికేయ 2" సినిమా టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కాలభైరవ సంగీతం చాలా బాగుంది. మధ్యలో వచ్చే మంత్రాలు, శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. కార్తికేయ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

బలాలు:

కథ

నిఖిల్ నటన

నెరేషన్

విజువల్స్

బలహీనతలు:

కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లేకపోవడం

కొన్ని సన్నివేశాలు రష్ చేయడం

చివరి మాట:

ముందు చెప్పుకున్నట్లు సినిమా కథ ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. దాని చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మరియు లొకేషన్ లు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో మరియు నరేషన్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మధుర లో మొదలవుతుంది. దేవుడు మరియు మానవత్వం గురించిన డైలాగులు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. ఇక అదిరిపోయే నేపథ్య సంగీతం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో రష్ చేసినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని సన్నివేశాలలో లాజిక్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కథ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ఉంది. ఓవరాల్ గా "కార్తికేయ 2" థ్రిల్లింగ్ కథతో బాగానే ఆకట్టుకుంది.

బాటమ్ లైన్:

"కార్తికేయ 2" ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే మైథాలజికల్ మరియు అడ్వెంచరస్ రైడ్.

Show Full Article
Print Article
Next Story
More Stories