'జెర్సీ' మూవీ రివ్యూ

జెర్సీ మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: జెర్సీ నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, సంపత్ రాజ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ప్రవీణ్, తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ...

చిత్రం: జెర్సీ

నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, సంపత్ రాజ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ప్రవీణ్, తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: సను వర్గీస్

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేదీ: 19/04/2019

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్లు అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'జెర్సీ' మీదనే పెట్టుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. కెరీర్లో మొట్టమొదటిసారిగా నాని ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ 'యూటర్న్' ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ అనగా ఏప్రిల్ 9, 2019న విడుదల అయింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను మెప్పించిన నాని సినిమాతో ఎంతవరకు మెప్పించాడో చూసేద్దామా.

కథ:

అర్జున్ (నాని) ఒక మాజీ క్రికెటర్. ఎప్పటికైనా ఇండియన్ టీం లో క్రికెటర్ గా మారాలని అతని కల. కానీ రెండు సార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. ఆ తరువాత సడన్ గా క్రికెట్ కు దూరం కావాల్సి వస్తుంది. అర్జున్ కు ఫుడ్ కార్పొరేషన్ లో ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. జాబ్ పోవడంతో కష్టాల్లో పాలవుతాడు. అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ భార్య సారా (శ్రద్ధ శ్రీనాధ్) తో ఈ విషయమై గొడవలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో అర్జున్ మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. అసలు క్రికెట్ కు అర్జున్ ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్లీ క్రికెట్ ను పై అర్జున్ ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

నాని నటన ఈ సినిమాకు వెన్నెముకగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ లలో నాని కనబరిచిన నటన తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం క్రికెట్ ట్రైనింగ్ కోసం నాని చాలా కష్టపడ్డాడు అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. శ్రద్ధ శ్రీనాధ్ చాలా బాగా నటించింది. నానితో తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నానితో సమానంగా శ్రద్ద శ్రీనాద్ మంచి నటనను కనబరిచింది. సత్యరాజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. బ్రహ్మాజీ కూడా ఈ సినిమాలో బాగానే నటించాడు. సంపత్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రవీణ్ తన పాత్రకు బాగా సెట్ అయ్యాడు. ఇక మిగతా నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం :

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం మనసుకు హత్తుకునే విధంగా ఒక కథను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో రొమాన్స్, కామెడీ అన్నిటికంటే ఎక్కువగా ఎమోషన్స్ పైన బాగా దృష్టి పెట్టాడు. అయినప్పటికీ కష్టమైన సీన్లను కూడా చాలా బాగా హ్యాండిల్ చేసి మెప్పించాడు. సినిమాకు గౌతం తిన్ననూరి నెరేషన్ మరొక ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీ పడకుండా సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా మారింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మరింత హత్తుకునే విధంగా ఉంటుంది. సను వర్గీస్ ఈ సినిమా కోసం అద్భుతమైన విజువల్స్ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

నాని నటన

బలమైన కథ

పాటలు, నేపధ్య సంగీతం

బలహీనతలు:

కొన్ని సాగతీత సన్నివేశాలు

ఎమోషనల్ కంటెంట్

చివరి మాట:

'జెర్సీ' ఒక అందమైన ఎమోషనల్ కథ అని చెప్పుకోవచ్చు. సినిమా మొదటి హాఫ్ మొత్తం రొమాన్స్, కామెడీ తో నిండి ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్టు సినిమాలు ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమా రెండవ హాఫ్ మొత్తం ఎమోషనల్గా నడుస్తుంది. ముఖ్యంగా ట్రైన్ స్టేషన్ లో వచ్చే సన్నివేశం అందులో నాని నటన సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకులు కథలో లీనమై పోతారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సినిమాలో మరొక హైలైట్. ఈ మధ్యకాలంలో చూసిన అన్ని సినిమాలలో కంటే 'జెర్సీ' క్లైమాక్స్ మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఓవరాల్ గా జెర్సీ అందరూ తప్పకుండా చూడవలసిన ఒక ఎమోషనల్ చిత్రం.

బాటమ్ లైన్:

తప్పకుండా అందరూ చూడాల్సిన 'జెర్సీ'.

Show Full Article
Print Article
Next Story
More Stories