Geethanjali Malli Vachindi Review: గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఎలా ఉందంటే?

Geethanjali Malli Vachindi Movie Review in Telugu
x

Geethanjali Malli Vachindi Review: గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఎలా ఉందంటే?

Highlights

Geethanjali Malli Vachindi Review: కోన వెంకట్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

చిత్రం: గీతాంజలి మళ్ళీ వచ్చింది;

నటీనటులు: అంజలి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, సునీల్‌, అలీ, రవి శంకర్‌, రాహుల్‌ మాధవ్‌ తదితరులు;

సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు;

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ;

ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌;

నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ;

కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, భాను భోగవరపు;

దర్శకత్వం: శివ తుర్లపాటి;

విడుదల: 11-04-2024

Geethanjali Malli Vachindi Review: కోన వెంకట్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కోన వెంకట్ అంటే సపరేట్ కామెడీ ట్రాక్‌లుంటాయి. గీతాంజలి సినిమాతో హారర్, కామెడీ జానర్లను మిక్స్ చేశారు. ఇక ఇప్పుడు గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రాన్ని తీశారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించింది. కథేమీ కొత్తగా లేదు కదా? అని అంతా అనుకున్నారు. కానీ ఎలా మ్యాజిక్ చేస్తారు? ఎలా మెప్పిస్తారు? అని అంతా ఎదురుచూశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథేంటంటే: ‘గీతాంజలి’ సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్‌ శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) ఆ తర్వాత హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్‌లో ఉంటున్న తన మిత్రుడు అయాన్‌ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హైదరాబాద్‌ వచ్చిన అయాన్‌.. తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్, శ్రీనులతో పాటు తన సహ రచయితలు ఆరుద్ర (షకలక శంకర్‌), ఆత్రేయ (సత్యం రాజేష్‌) గ్యాంగ్‌ ఓ ఆలోచన చేస్తారు. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్‌ యజమాని విష్ణు (రాహుల్‌ మాధవ్‌) మేనేజర్‌ నుంచి శ్రీనుకు ఓ ఫోన్‌ వస్తుంది. తనతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా నిర్మిస్తానని చెప్పి.. ఓ కథను శ్రీను గ్యాంగ్‌ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్‌ మహల్‌లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు. ఆ కథ కోసం నాయికగా అంజలి (అంజలి)ని తీసుకోమని సూచిస్తాడు. వాళ్లంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్‌లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్‌లోకి అడుగు పెట్టిన అంజలి, శ్రీను గ్యాంగ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్‌లోనే చిత్రీకరించాలని ఎందుకు పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి, శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాడు? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అన్నది మిగతా కథ.

సినిమా విశ్లేషణ..హారర్ కామెడీ అన్నప్పుడు హారర్, కామెడీ ఈ రెండు అంశాలని పర్ఫెక్ట్ గా సెట్ చేయాలి. పార్ట్ 1లో అది కరెక్ట్ గా ఉండటంతో సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా రెండు అంశాలని చక్కగా బ్యాలెన్స్ చేయాలనుకున్నా కామెడీ ఎక్కువై హారర్ తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా శ్రీను అండ్ వాళ్ళ బ్యాచ్ సినిమా కష్టాలు, సినిమా ఛాన్స్ రావడం, అక్కడ దయ్యాలు ఉన్నాయని తెలియడం, ఆ దయ్యాల కథ చూపించి ఇంటర్వెల్ కి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఆ బూత్ బంగ్లాలో దయ్యాలతో సినిమా షూటింగ్ అంటూ హిలేరియస్ గా నవ్వించారు. క్లైమాక్స్ కూడా కొంచెం ఆసక్తికరంగా నడిపించినా క్లైమాక్స్ లో లో కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కూడా కొంచెం తేలిపోతాయి. మొదటి పార్ట్ కి, ఈ సినిమాకి మాత్రం మంచి కనెక్షన్ ఇచ్చారు. పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. గీతాంజలి పార్ట్ 3 అనౌన్స్ చేయకపోయినా క్లైమాక్స్ వల్ల పార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని అర్ధమవుతుంది.

నటీనటులు...అంజలికి గీతాంజలి రేంజ్ లో ఈ మళ్ళీ వచ్చింది గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. ఉన్నంతలో డీసెంట్ గా కానిచ్చేసింది కానీ స్కోప్ ఉన్న క్లైమాక్స్ లోనూ దర్శకుడు ఆమెను వాడుకోలేదు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ లకు పెద్దగా ఛాన్స్ దక్కలేదు. అలవాటైన రీతిలో అతి మాములుగా నటించేశారు. సత్య ఆకట్టుకుంటాడు. దెయ్యంని వెక్కిరించే సీన్ లో, బిల్డప్ ఇచ్చే హీరోగా డైలాగులు చెప్పే విధానంలో మంచి టాలెంట్ చూపించాడు. సునీల్ పర్వాలేదు. చాలా గ్యాప్ తర్వాత తనలో అసలు కమెడియన్ ని బయటికి తీశాడు. విలన్ రాహుల్ మాధవ్ జస్ట్ ఓకే. అలీ పర్వాలేదు. రవిశంకర్ తదితరులవి చాలాసార్లు చూసిన అరిగిపోయిన బాపతే. కొత్తగా ఏం లేదు.

సాంకేతిక వర్గం... ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో పెద్దగా మెరుపుల్లేవ్. పాటలు ఏ మాత్రం ఉపయోగడపడలేదు. బీజీఎమ్ అక్కడక్కడ పర్వాలేదనిపించినా ఒకదశ దాటాక రిపీట్ అనిపిస్తుంది. సుజాత సిద్దార్థ ఛాయాగ్రహణం వీలైనంతలో బడ్జెట్ కాంప్రోమైజ్ ని దాచిపెట్టి క్వాలిటీ చూపించేందుకు కష్టపడింది. గ్రాఫిక్స్ వల్ల ఆ పనితనం కూడా ప్రభావితం చెందింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండాల్సింది. రెండో సగం ల్యాగ్ గుర్తించాల్సింది. భాను భోగవరపు, నంది సవరిగన సంభాషణల్లో కొంచెం చమక్కులు ఉన్నాయి కానీ ఫుల్ ఫన్ అనిపించేందుకు సరిపోలేదు. ఎంవివి సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ నిర్మాణ విలువలు గొప్పగా కాదు తెలివిగా సాగాయి.

రేటింగ్: 2.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories