F3 Movie Review: ఆసక్తికరంగా మొదలై.. అతి కామెడీ తో.. లాజిక్స్ మర్చిపోయిన బాగానే నవ్విస్తుంది...

F3 Movie Genuine Review Telugu | Anil Ravipudi | Venkatesh | Varun Tej | Live News
x

F3 Movie Review: ఆసక్తికరంగా మొదలై.. అతి కామెడీ తో.. లాజిక్స్ మర్చిపోయిన బాగానే నవ్విస్తుంది...

Highlights

F3 Movie Review: F3 మూవీ రివ్యూ...

F3 Movie Review:

చిత్రం: ఎఫ్ 3

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహారీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, ప్రగతి, మురళి శర్మ, అలి తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీ రామ్

నిర్మాత: శిరీష్

దర్శకత్వం: అనిల్ రావిపూడి

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్

విడుదల తేది: 27/05/2022

2019లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహారీన్ లు హీరోహీరోయిన్లుగా నటించిన "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు "ఎఫ్ 3: ఫన్ అండ్ ఫస్ట్ రేషన్" తెరకెక్కనుంది. "ఎఫ్2" కంటే ఈ సినిమాలో పది రెట్లు ఎక్కువ ఫన్ మరియు కామెడీ ఉంటుంది అంటూ దర్శక నిర్మాతలు మరియు చిత్రబృందం సినిమా గురించి బాగానే హైప్ ఇచ్చింది. ఇక ట్రైలర్ తో కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా మే 27 థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిన చూసేద్దామా

కథ:

వెంకీ (వెంకటేష్) మరియు వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) లు చాలా సాధారణ వ్యక్తులు. మిడిల్ క్లాస్ జీవితంలో బతికే వీరిద్దరూ ఎప్పుడూ డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు. ఒకసారి వీరు ఒక ఒక బాగా డబ్బున్న ఇండస్ట్రియలిస్ట్ తన ఆస్తికి వారసుడు కోసం వెతుకుతున్నాడు అని తెలుసుకుంటారు. దీంతో విజయనగరానికి వెళ్లి తామే ఇండస్ట్రియలిస్ట్ కి వారసులుగా నటిస్తారు. మరి వారు అనుకున్న డబ్బు వారికి దొరికిందా? వెంకీ మరియు వరుణ్ ఎవరికీ అయినా పట్టు పడ్డారా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

వెంకటేష్ ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. తన అద్భుతమైన నటనతో తన పాత్రలో ఒదిగిపోయి వెంకీ చాలా బాగా నటించారు. ఇక వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి ప్రాణం పోసాడు అని చెప్పుకోవచ్చు. "ఎఫ్ 2" తో పోలిస్తే ఈ సినిమాలో వరుణ్ మరింత ఈజ్ తో నటించాడు. తన కామెడీ కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. ఇక తమన్నా మరియు మెహరిన్ లు ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యారు. తమ అందంతో మాత్రమే కాక నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. వారి కామెడీ కూడా బాగానే అనిపించింది. అలీ పాత్ర అ ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన తన పాత్రలో ఒదిగి పోయి చాలా బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి తనదైన స్టైల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. చాలా కాలం తర్వాత సునీల్ ని ఒక చాలా మంచి కామెడీ పాత్ర దొరికింది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, రఘుబాబు తదితరులు కూడా సినిమాల్లో బాగానే నవ్వించారు.

సాంకేతిక వర్గం:

"ఎఫ్ 2" సినిమా కి సీక్వెల్ అయినప్పటికీ అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఒక సరికొత్త కథని రాసుకున్నారు. ఎలాంటి సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసే అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా కామెడీ పై బాగా ఫోకస్ చేశారు. సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ కథ ఏమీ లేకపోయినప్పటికీ చాలావరకు సినిమా ఎంటర్టైన్మెంట్ తో నే ముందుకు వెళుతుంది. అయితే నరేష్ అన్న పరంగా కూడా "ఎఫ్ 2" సినిమా కి మరియు ఈ సినిమాకి కొన్ని బేధాలు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పరవాలేదు అనిపించింది. సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా కోసం మంచి విజువల్స్ ను అందించారు. తమ్మి రాజు ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

బలాలు:

వెంకటేష్

ఎంటర్టైన్మెంట్

నటీనటులు

బలహీనతలు:

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు

కథ బలంగా లేకపోవటం

సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో కామెడీ కొంచెం ఓవర్ గా అయినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగానే అనిపించినప్పటికీ మరి కొన్ని సన్నివేశాల్లో బోర్ కొట్టిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ కి రేచీకటి వరుణ్ తేజ్ కి నత్తి పెట్టారు. దీని మీద వచ్చే ఎపిసోడ్లు చాలా కామెడీగా అనిపిస్తాయి. రాజేంద్రప్రసాద్ సబ్ ప్లాట్ కూడా బాగానే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కొంచెం ఓవర్ గా కామెడీతో నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

"ఎఫ్ 3" లాజిక్స్ మర్చిపోయిన ప్రేక్షకులను బాగానే నవ్విస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories