Dakshina Movie Review: 'అమ్మాయిలను చంపే ఆ సైకో ఎవరు'.? ఉత్కంఠ భరితంగా దక్షిణ మూవీ..!

Dakshina Movie Review:  అమ్మాయిలను చంపే ఆ సైకో ఎవరు.? ఉత్కంఠ భరితంగా దక్షిణ మూవీ..!
x

Dakshina Movie Review: 'అమ్మాయిలను చంపే ఆ సైకో ఎవరు'.? ఉత్కంఠ భరితంగా దక్షిణ మూవీ..!

Highlights

మంత్ర, మంగళ వంటి ఇంట్రెస్టింగ్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌ నుంచి వచ్చిన కొత్త చిత్రం 'దక్షిణ'.

నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు

ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె)

సంగీతం : బాలాజీ

నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్

నిర్మాత : అశోక్ షిండే

రచన - దర్శకత్వం : ఓషో తులసీరామ్.

మంత్ర, మంగళ వంటి ఇంట్రెస్టింగ్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌ నుంచి వచ్చిన కొత్త చిత్రం 'దక్షిణ'. సినిమా కాన్సెప్ట్‌ ప్రకటించిన రోజు నుంచే ఈ చిత్రంపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. కబాలి ఫేమ్‌ సాయి ధన్సిక లీడ్‌ రోల్‌లో నటించిన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా.? మంత్ర, మంగళతో మ్యాజిక్‌ చేసిన ఓషో తులసీరామ్‌ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారో తెలియాలంటే సినిమా రివ్వూలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే..

దక్షిణ (సాయి ధన్సిక) ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్. తనదైన శైలిలో నేరాలను అరికడుతూ, డేరింగ్ అండ్‌ డ్యాషింగ్ అన్న విధంలో ముందుకు సాగుతుంటుంది. అయితే ఇదే సమయంలో నగరంలో వరుసగా అమ్మాయిలు హత్యలు జరుగుతుంటాయి. ఓ అజ్ఞాత వ్యక్తి మహిళలను ఒకరి తర్వాత మరొకరిని కిడ్నాప్‌ చేస్తూ అత్యంత కిరాతకంగా హతమారుస్తుంటాడు. తలలు నరికి పడేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు. ఈ సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీస్‌ శాఖ తీవ్ర ప్రయత్నం చేస్తుంటుంది. ఇదే సమయంలో దక్షిణకు కూడా సైకో తీరని అన్యాయం చేస్తాడు. దీంతో దక్షిణ ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది.? ఈ క్రమంలో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది.? చివరి కిల్లర్‌ ఎలా దొరికాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే..

మంత్ర, మంగళ వంటి చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌ పరిచయం చేసిన దర్శకుడు ఓషో 'దక్షిణ'లో కూడా ఆడియన్స్‌కు అలాంటి అనుభూతినే అందించాడు. అమ్మాయిల హత్యల చుట్టూ జరిగిన కథను నడిపించే విధానంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. ఇక సాయి ధన్సిక తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని చెప్పాలి. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ధన్సిక తన నటనతో ప్రేక్షలను మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషవ్ బసు నటన ప్రేక్షలను ఆకట్టుకుటుంది.

కొన్ని సీరియస్‌ క్రైమ్‌ సన్నివేశాల్లో అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రిప్పింగ్ కథాంశంతో ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. సినిమాలో తర్వాత ఏం జరగబోతోందన్న అన్న ఆతుత్రను చివరి వరకు మెయింటెన్‌ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది, ఊహించని మలుపులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇక సెకండాఫ్ ని డైరెక్టర్ ఎమోషనల్ గా నడిపించిన విధానం చాలా బాగుంది. మొత్తం మీద ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమాగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దసరాకు ఇండస్ట్రీకి దక్షిణ రూపంలో మరో హిట్‌ లభించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories