Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..

Bheemla Nayak Movie Review | Tollywood News
x

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..

Highlights

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..

చిత్రం: భీమ్లా నాయక్

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముతిరఖని, రావు రమేష్, బ్రహ్మానందం తదితరులు

సంగీతం: ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్

నిర్మాత: సూర్య దేవర నాగ వంశీ

దర్శకత్వం: సాగర్ కే చంద్ర

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేది: 25/02/2022

ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరొక హీరో గా కనిపించనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ సినిమా విడుదలైంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా ఫిబ్రవరి 25, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూసేద్దామా..

కథ:

డానియల్ శేఖర్ అలియాస్ డానీ ఒక మిలటరీ ఆఫీసర్. కానీ ఒకరోజు డానీ చేసిన తప్పు వల్ల ఎస్ ఐ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) డానీను అరెస్ట్ చేస్తారు. జైలుకు వెళ్లే ముందు డానీ తనకి బెయిల్ వస్తే కచ్చితంగా పగ తీర్చుకుంటానని బెదిరిస్తాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వైరం మొదలవుతుంది. ఒక చిన్న గొడవ తో మొదలై కుటుంబాలు సైతం ఇన్వాల్వ్ అయ్యేంత పెద్దగా వారి గొడవ పెరుగుతుంది. అసలు వీరిద్దరికీ గొడవ ఎందుకు మొదలైంది? వీరిద్దరి గొడవలో భీమ్లా నాయక్ భార్య (నిత్యమీనన్) మరియు డానియల్ వాళ్ళ నాన్న (సముతిరఖని) ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల నటన ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదిరిపోయే పర్ఫామెన్స్ ను కనబరిచారు. అగ్రసివ్ మేనరిజమ్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో మాస్ ప్రేక్షకులకు కనువిందు చేశారు పవన్ కళ్యాణ్. రాణా కూడా తనదైన స్టైల్ లో తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో తన పాత్రలో ఒదిగిపోయి అందర్నీ ఆకర్షించారు. నిత్య మీనన్ నటన కూడా ఈ సినిమాకు బాగానే ప్లస్ అయింది. సంయుక్త మీనన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. సముతిరఖని, మురళి శర్మ, రావు రమేష్ తదితరులు తమ పాత్రలలో చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

రీమేక్ సినిమా అయినప్పటికీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర టేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చే లాగా సినిమాను తీర్చిదిద్దారు. త్రివిక్రమ్ చాలావరకు స్క్రీన్ప్లే ని మార్చి తెలుగు నేటివిటీకి సూట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా తెరకెక్కించారు సాగర్ కే చంద్ర. మరోవైపు కొన్ని సన్నివేశాలు త్రివిక్రం అందించిన డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. సినిమాకి నిర్మాణ విలువలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి వెన్నెముకగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తమన్ అందించిన నేపథ్య సంగీతం మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. సినిమాటోగ్రఫర్ చక్కటి విజువల్స్ ను ప్రేక్షకులకు అందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

పవన్ కళ్యాణ్ మరియు రానా ల నటన

కొన్ని కీలక సన్నివేశాల్లోని డైలాగులు

యాక్షన్ సన్నివేశాలు

నేపథ్య సంగీతం

సెకండాఫ్ మరియు క్లైమాక్స్

బలహీనతలు:

ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉండటం

ఒకటి, రెండు వీడియో సాంగ్స్ అంతగా మెప్పించకపోవడం

కొరియోగ్రఫీ

చివరి మాట:

సినిమా ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ చాలా స్లోగా అనిపిస్తుంది క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే బస్ సన్నివేశాలు డైలాగులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొదటి హాఫ్ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ఆయువుపట్టుగా మారింది. సెకండ్ హాఫ్ లో ని ఆక్షన్ సన్నివేశాలు సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు నచ్చే వారికి సినిమా కన్నులవిందు గా ఉంటుంది.

బాటమ్ లైన్:

ఒరిజినల్ సినిమాకి మించి ఇంప్రెస్ చేశాడు "భీమ్లా నాయక్".

Show Full Article
Print Article
Next Story
More Stories